Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తున్న మరోపక్క సినిమాలు చేస్తూ ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో బిజీగా ఉన్న పవన్… అప్పట్లో పెద్దగా సినిమాలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల టైంలో ఇక పూర్తిగా తన జీవితం రాజకీయాలకు అంకితం అని ప్రకటించడంతో పవన్ సినిమా ప్రపంచానికి ఆల్మోస్ట్ దూరమై పోయారని అందరూ భావించారు. అదేసమయంలో ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా కట్టె కాలే వరకు సినిమాలు చేసే ప్రసక్తి లేదని.. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు.
అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఏమో తెలియదు కానీ మళ్ళీ పవన్ సినిమాలు స్టార్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న.. పవన్ గత ఏడాదే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. గత ఏడాది తన పుట్టినరోజు నాడు హరీష్ సినిమా కి సంబంధించి… అధికారిక ప్రకటన .. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రకటించడం జరిగింది. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ అవటంతో పాటు హరీష్ పవన్ కళ్యాణ్ అభిమాని కావటంతో.. అప్పటినుండి ఈ ప్రాజెక్టు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు దాదాపు ఏడాది నుండి సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో లేటెస్ట్ అప్డేట్ సినిమా యూనిట్ ప్రకటించింది. త్వరలోనే సినిమాకి సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఉగాది పండుగనాడు ప్రకటించాలని చూసిన ఆ టైంలో పాండమిక్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోస్ట్ పోన్ అయ్యింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ప్రకటన ఉంటుందని సరైన టైంలో ప్రకటిస్తామని తాజాగా ఈ సినిమా యూనిట్ తెలిపింది. దీంతో అభిమానులు కచ్చితంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనగా సెప్టెంబర్ రెండో తారీకు.. విడుదల అవుతుందని భావిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!