వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారతదేశ చరిత్రలోని విలక్షణ దర్శకుల్లో ఒకడిగా గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
అయితే ఇప్పుడు అతను తీస్తున్న సినిమాలకు కనీస కలెక్షన్లు కూడా రావడం లేదు.దీంతో లాక్ డౌన్ వల్ల వినూత్నంగా తనకంటూ ఒక వెబ్సైట్ పెట్టుకొని తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ ఈ కరోనా కాలాన్ని బాగా ఉపయోగించుకుని కోటానుకోట్లు గడించాడు. ఒకే సమయంలో రెండు మూడు ప్రాజెక్టు అనౌన్స్ చేసి నెలల్లో సినిమాను తీసేయడం వర్మ స్పెషాలిటీ.
అయితే ఆర్జివి చాలా ఇంటర్వ్యూలలో మహిళలపై చేసే కామెంట్లు చాలా అభ్యంతరకరంగా ఉంటాయని ఇప్పటికీ ఎన్నో మహిళా సంఘాలు అతని పై విరుచుకు పడ్డాయి. కానీ చట్టపరంగా అతనిని ఏమీ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ తన తర్వాత చిత్రానికి హీరోయిన్ గా ‘అక్షర రాణి’ అనే ఒక మోడల్ ని సెలెక్ట్ చేసినట్టు వెల్లడించారు. ఒరిస్సా లో పుట్టిన ఈమె డెహ్రాడూన్ లో పెరిగి ప్రస్తుతానికి హైదరాబాద్ లో నివాసం ఉంటోంది. ఈమె చాలా మంచి డాన్సర్ అని అంతకుమించిన యాక్టర్ కూడా అని వర్మ కొనియాడాడు.
అయితే ఇదే సమయంలో వర్మ తర్వాత సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న అక్షర తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వర్మ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పెట్టారు. అయితే రామ్ గోపాల్ వర్మ తన ఫేవరెట్ డైరెక్టర్ అని చెబుతున్న ఆమె బుగ్గ పై రామ్ గోపాల్ వర్మ ముద్దు పెడుతూ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలే వర్మకు ‘ఉమనైజర్’ అనే ఒక ట్యాగ్ ఉంది. ఇక ఇలాంటి ఫోటో ఒకటి బయటకు వచ్చాక అందరూ ఆ హీరోయిన్ కి వర్మకి మధ్య ఏదో ఉందని తమకు నచ్చినట్లు ఊహించుకోవడం మొదలు పెట్టేశారు. మరి ఏదైనా బోల్డ్ గా కూడా చెప్పే ఆర్జీవ్వీ ఈ విషయమై ఏమన్నా వివరణ ఇస్తాడో లేదో వేచి చూడాలి.