Prabhas: పాన్ ఇండియన్ స్టార్‌గా ఇప్పుడు ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలలోనూ అసాధారణంగా పెరిగింది. ఇంతకాలం అందరూ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ సాధిస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్‌ను చూస్తే అది ఏపాటి అనుకుంటున్నారు. అందుకు కారణం ప్రభాస్‌కు దేశం, భాషతో సంబంధం లేకుండా కోట్లలో అభిమానులు పెరుగుతుండటమే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ను అభిమానించే ప్రేక్షకులు ఇటలీ జపాన్లలో విపరీతంగా పెరిగిపోయారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా వారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ రొమాంటిక్ మూవీగా రాధే శ్యామ్ రూపొందుతోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 7 భాషలలో జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుసగా ఒక్కో సాంగ్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నారు. త్వరలో మరో సాంగ్ రాధే శ్యామ్ సినిమా నుంచి రాబోతోంది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అందించిన సాంగ్స్ అటు హిందీలో, ఇటు సౌత్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
Prabhas: టాలీవుడ్లో ఇది కేవలం ప్రభాస్‌కు మాత్రమే దక్కిన గౌరవం..
అయితే, మన పాన్ ఇండియన్ స్టార్‌కు జపాన్‌లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతకముందు సౌత్ సినిమా ఇండస్ట్రీలన్నిటిలో ఒక్క రజనీకాంత్‌కు మాత్రమే జపాన్‌లో అభిమానులు, అభిమాన సంఘాలు ఉండేవి. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ప్రభాస్ బ్రేక్ చేశాడు. సాహో సినిమా సమయంలో ఆ సినిమాను బాగా ప్రమోట్ చేశారు. సాహో కటౌట్స్ తో పబ్లిటీ చేశారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అని తెలిసిన డార్లింగ్ జపాన్ అభిమానులు ఇప్పటి వరకు రిలీజైన సాంగ్‌ను పాడుతూ రాధే శ్యామ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఇది కేవలం ప్రభాస్‌కు మాత్రమే దక్కిన గౌరవం అని గొప్పగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు చెప్పుకుంటున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!