బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ గతేడాది తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సరోగసి విధానం ద్వారా ఈ దంపతులు ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. తన కూతురికి ‘మాల్తీ మేరి చోప్రా జోనస్’గా నామకరణం చేశారు. అయితే పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ముఖం చూపించలేదు. ఏడాది పాటు తమ కూతురి ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడ్డారు. రీసెంట్గా జనవరి 15న మాల్తీ మేరీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అప్పుడు కూడా ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడింది ప్రియాంక చోప్రా. కానీ, రీసెంట్గా ప్రియాంక చోప్రా తన గారాల పట్టీని ప్రపంచానికి పరిచయం చేసింది. సోషల్ మీడియాలో మాల్తీ మేరి ఫోటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్లో చిట్టితల్లి ముద్దొస్తుందంటూ ప్రియాంక అభిమానులు సంబరపడుతున్నారు.
సోమవారం ప్రియాంక భర్త నిక్ జోనస్, ఆయన సోదరులకు అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక, జోనస్ కుటుంబం హాజరైంది. ప్రియాంకతోపాటు మాల్తీ మేరీ కూడా సందడి చేసింది. మాల్తీతో ఆడుకుంటూ ప్రియాంక ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవి కెమెరాకు చిక్కడంతో ప్రస్తుతం ఈ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏడాది నుంచి ఎప్పుడెప్పుడు పాపను చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న ప్రియాంక ఫ్యాన్స్ మాత్రం సంతోషంలో మునిగి తేలుతున్నారు. వైట్ డ్రెస్లో ఏంజెల్లా కనిపిస్తోందని నెట్టింట పొగిడేస్తున్నారు.
రీజన్ ఇదేనా?
సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను దాచి పెడుతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడైన ఫోటో షేర్ చేసినా తమ పిల్లల ముఖాలపై ఎమోజీలను ఉపయోగిస్తారు. మీరు కూడా ఒక సెలబ్రిటీ ఫాలొవర్ అయితే.. ఈ విషయాన్ని మీరూ గమనించి ఉంటారు. ఎందుకు ముఖాన్ని దాచుకుంటారు? దానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను చూపించడానికి ఇష్టపడరట. తమ వ్యక్తిగత విషయాన్ని దాచి పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారట. అందుకే పిల్లల ఫోటోలను త్వరగా రివీల్ చేయరట. ఒకవేళ పిల్లలతో ఫోటోను షేర్ చేసుకోవాలని అనిపించినప్పుడు.. పిల్లల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్త పడతారు.
క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, నటి నయనతార-విఘ్నేష్, అలియా భట్-రణబీర్, సోనమ్-ఆనంద్ తదితర సెలబ్రిటీలు ఇప్పటివరకు తమ పిల్లల ఫోటోలను రివీల్ చేయలేదు. ఈ జాబితాలోనే మొన్నటివరకు ప్రియాంక-నిక్ కూడా ఉన్నారు. తమ అభిమాన నటుల పిల్లలను చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆతురత ఉన్నప్పటికీ.. తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం సెలబ్రిటీలకు నచ్చదు. అందుకే వాళ్లు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తుంటారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!