Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ నటిస్తున్న పుష్ప షూటింగ్ మొన్నటివరకు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమాని దింపుతూ ఉండటంతో.. పుష్ప సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కెరీర్ లో ఎప్పుడూ ఎన్నడూ లేని రీతిలో.. గంధపు చెక్కల స్మగ్లర్ గా మాత్రమేకాక లారీ డ్రైవర్ పాత్రలో.. బన్నీ నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పై గత సినిమాల కంటే పూర్తిగా మేకోవర్ మార్చడంతో.. సినిమా స్టోరీ ఏంటి అన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది.
పరిస్థితి ఇలా ఉండగా… సినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే “పుష్ప” ఫస్ట్ పార్ట్.. ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని ఇటీవల సినిమా యూనిట్.. మొదటి భాగానికి సంబంధించి మిగిలి ఉన్న షూటింగ్ చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా కారణంగా కొద్ది నెలల పాటు షూటింగ్ ఆగిపోవడంతో ఇటీవల పరిస్థితి అదుపులోకి రావడం తో గోవాలో.. ఒక సాంగ్ కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సినిమా యూనిట్.. అక్కడ షూటింగ్ ఏర్పాటు చేయగా.. కొద్ది రోజులు షూటింగ్ జరుపుకున్న ఇక తాజాగా ఇటీవల సినిమా డైరెక్టర్ సుకుమార్ కి విపరీతమైన జ్వరం రావడం జరిగింది.
Read More: Pushpa : పుష్ప తర్వాత బన్ని ఫిక్సైందా ఆ డైరెక్టర్కేనా..?
దీంతో అర్థంతరంగా సినిమా యూనిట్ షూటింగ్ ఆపేసినట్లు.. సుకుమార్ కోలుకున్నాక మల్లేష్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తాజాగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామంతో ఈ సినిమా ఆగస్టు మాసంలో సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం కష్టమే అని మేకర్స్ అంటున్నారు. సినిమాకి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన టీజర్..కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అభిమానులు అదేవిధంగా సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!