Deepika padukone : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షనల్ మూవీ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తాజాగా సెట్స్ మీదకి వచ్చింది. ఫస్ట్ క్లాప్ ప్రభాస్ అమితాబ్ జీ కొట్టి షూటింగ్ మొదలు పెట్టారు. ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ వారం రోజులు ప్లాన్ చేశారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యాం, సలార్, ఆదుపురుష్ సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చాక ఈ సినిమా మొదలవనుంది.
రాధే శ్యాం త్వరలో పూర్తవుతుంది. దాంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ కి డేట్స్ ఇవ్వనున్నాడు. ఆ సమయానికి దీపిక పదుకొణ్ కూడా బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలను కొంతవరకు పూర్తి చేసి ప్రభాస్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమాలో జాయిన్ కాబోతోంది. తెలుగులో దీపిక పదుకొణ్ నటిస్తున్న డెబ్యూ సినిమా. అయితే మరో సౌత్ సినిమాలో దీపిక పదుకొణ్ నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. ఆ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని తెలుస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే.
Deepika padukone : రజనీ – దీపిక జోడీ ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దాంతో నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజనీకాంత్. అందులో ఒకటి ధనుష్ డైరెక్షన్ లో చేయబోతుండగా మరొక సినిమాను దేశింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రజనీకాంత్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొణ్ ని మేకర్స్ తీసుకోవాలనుకుంటున్నారట. ఇంతకముందు కొచ్చాడియన్ సినిమాలో దీపిక పదుకొణ్, రజనీకాంత్ తో కలిసి నటించారు. అయితే అది యానిమెటెడ్ మూవీ కాబట్టి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఈసారి రజనీ – దీపిక జోడీ ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.