NewsOrbit
న్యూస్

Rajamouli: మహేష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే “బాహుబలి 3″కి భారీగా రంగం సిద్ధం చేస్తున్న రాజమౌళి..??

Rajamouli: దర్శకధిరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి 2″(Bahubali 2) భారతీయ చలనచిత్ర రంగ రూపురేఖలను మార్చేయడం తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు మొత్తం బ్రేక్ చేసిన ఈ సినిమా.. విడుదలయ్యి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా గాని..”బాహుబలి 2” రికార్డులు ఇంకా చెక్కుచెదరలేదు. బాలీవుడ్(Bollywood) మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు.. ఉచకోత మాదిరిగా.. అన్ని ఇండస్ట్రీలలో రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ సినిమాగా నిలిచింది. ఏకంగా ఈ సినిమా విజయాన్ని చాలా సందర్భాలలో దేశ ప్రధాని మోడీ(Modi) ప్రస్తావించటం జరిగింది.

rajamouli action plan for bahubali part three under ground work

అంత మాత్రమే కాదు .. “బాహుబలి” సినిమా యూనిట్ నీ ప్రత్యేకంగా సత్కరించడం కూడా జరిగింది. ఈ సినిమాతో ప్రభాస్(Prabhas) కెరియర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ గా.. చలామణి అవుతున్నాడు. ఇటువంటి తరుణంలో బాహుబలి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలామంది అప్పటి నుండి డిస్కషన్ చేస్తున్నారు. అయితే తాజాగా రాజమౌళి ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అయితే మహేష్ సినిమా స్టార్ట్ అవ్వక ముందే “బాహుబలి 3” కి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వివిధ బ్రాంచ్ లలో బాహుబలి మూడో భాగానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు జక్కన్న తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇటీవల బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డతో కలసి.. ఎస్ ఎస్ రాజమౌళి పారిస్(Paris) లో యూనిట్ ఇమేజ్(Unit Image) అనే భారీ 3d VFX స్టూడియోకి వెళ్లడం జరిగింది.

 

వీళ్ళతోపాటు రాజమౌళి సినిమాలకు VFX సూపర్ వైజర్ గా పని చేస్తున్న కమల్ కన్నన్ కూడా వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో ఆ భారీ స్టూడియో సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఆ స్టూడియో దగ్గర దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.ఆ ఫొటోతో పాటు త్వరలో కీలకమైన ప్రాజెక్ట్ ప్రకటన  చేస్తున్నట్లు కూడా రాజమౌళి సోషల్ మీడియాలో తెలియజేశారు. “బాహుబలి” నిర్మాత పైగా బాహుబలి VFX కి పనిచేసిన టెక్నీషియన్.. రాజమౌళితో.. ఉండటంతో.. ఆ కీలక ప్రాజెక్ట్ “బాహుబలి 3” యే అని అంటున్నారు. యూనిట్ ఇమేజ్ అనే VFX స్టూడియో ద్వారా భారీ విజువల్ వండర్ సినిమాలు చాల వచ్చాయి. దీంతో తాజా రాజమౌళి పోస్ట్ ద్వారా.. “బాహుబలి 3” 3D వర్షన్ లో రాబోతున్నట్లు సరికొత్త వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాజమౌళి “RRR” సక్సెస్ సాధించటంతో మహేష్ ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ పనులు పై ఉన్నారు. అయితే మరోపక్క మహేష్ సినిమా కోసమే.. ప్యారిస్ లో ఆ VFC స్టూడియో ప్రతినిధులతో జక్కన్న మంతనాలు జరిపినట్లు మరో టాక్ వినిపిస్తోంది.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!