Ramyakrishna: నా జీవితంలో ప్రత్యేక స్థానం ఆ దర్శకుడే..అని సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ భర్త పేరు చెప్పకపోవడానికి కారణం ఇదే.

Share

Ramyakrishna: సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. హీరోయిన్ పరిచయమైన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకోవాలి. అప్పుడు అందరూ అవకాశాలివ్వడానికి రెడీ అవుతారు. ఒకవేళ మొదటి సినిమా గనక ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్‌ని బ్యాడ్ సెంటిమెంట్‌గా చూస్తారు. కథ బాగోలేక సినిమా ఫ్లాప్ అయిందా, దర్శకత్వం బాగోలేదా, ఇంకేమైనా కారణాలున్నాయా అనేది చూడరు. ఈ అమ్మాయి మన సినిమా చేసింది కాబట్టే సినిమా పోయింది అని ప్రచారం చేస్తారు. లక్ అనే హిందీ సినిమాతో పరిచయమైన విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి కూడా ఇలాగే కామెంట్ చేశారు.

ramyakrishna-gave special place to that director
ramyakrishna-gave special place to that director

శృతి హాసన్ అటు తమిళం, ఇటు తెలుగులో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. దాంతో తండ్రి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా శృతి మాత్రం ఐరెన్ లెగ్ అని కామెంట్ చేశారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ పట్టించుకోకుండా శృతి హాసన్‌కి అవకాశం ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేశ్ కూడా మొదట్ శృతి హాసన్ మనకి వద్దు బాబు..ఆ అమ్మాయి చేసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఆమెని తీసుకుంటే మన సినిమా కూడా ఫ్లాపవుతుందేమొ అన్నాడు.

Ramyakrishna: రమ్యకృష్ణ హీరోయిన్‌గా పనికిరాదని కామెంట్స్ చేసి పక్కన పెట్టారు.

నువ్వేమైనా 10 హిట్ సినిమాలు చేశావా..ఏమీ మార్చనవసరం లేదు..ఆమెనే తీసుకో అని చెప్పాడు. అలా శృతి హాసన్ ఫేట్ మార్చాడు. అలా ఫేట్ మారి స్టార్ హీరోయిన్‌గా, శివగామిగా ఇప్పుడు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఆమె మొదటి సినిమా భలే మిత్రులు. ఈ సినిమా 1985లో వచ్చింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో రమ్యకృష్ణకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. పైగా ఈ సినిమా తర్వాత నటించిన సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. దాంతో ఇక ఈమె హీరోయిన్‌గా పనికిరాదని కామెంట్స్ చేసి పక్కన పెట్టారు.

అయితే సీనియర్ స్టార్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు మాత్రం రమ్యకృష్ణ మంచి స్టార్ అవుతుందని నమ్మకంతో తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అల్లుడు గారు. ఇందులో హీరో మంచు మోహన్ బాబు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లరి మొగుడు, ఇద్దరు మిత్రులు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే అవకాశం అందుకున్నారు. ఆ సినిమాలన్ని భారీ సక్సెస్ అందుకోవడంతో ఇక కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

Ramyakrishna: రమ్యకృష్ణ జీవితాంతం చెప్పుకునే పాత్ర నరసింహ సినిమాలో నీలాంబరి.

రమ్యకృష్ణ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయో సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ. ఈ సినిమాలో ఆమె పోషించిన నీలాంబరి జీవితాంతం చెప్పుకునే పాత్ర. ఆ తర్వాత బాహుబలి సినిమాలో శివగామి. హీరోయిన్‌గా సినిమాలు తగ్గిపోయాక చేసిన బాహుబలి రమ్యకృష్ణ కెరీర్‌ని మార్చింది. అలాంటి హుందతనంతో కూడుకున్న పాత్రలు చేయాలంటే ఒకే ఒక్క ఆప్షన్ రమ్యకృష్ణ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకునేలా బాహుబలి సినిమాలో శివగామిగా నటించి మెప్పించారు. ఇప్పుడు కొన్ని పాత్రలకి రమ్యకృష్ణ కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. అందుకే తన భర్త స్టార్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ పేరు కాకుండా తన సినీ కెరీర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం రాఘవేంద్ర రావు అని నిర్మొహమాటంగా చెప్తారు రమ్యకృష్ణ.


Share

Related posts

మోనాల్ గ‌జ్జ‌ర్‌పై క‌క్ష‌క‌ట్టిన రాహుల్‌? ఫైర‌వుతున్న అభిమానులు!

Teja

బ్రేకింగ్: బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల… మూడు దశల్లో పోలింగ్

Vihari

చంద్రబాబు గూటికి వైసీపీ పార్టీ నేత..??

sekhar