Ravi teja: కెరియర్ లో డిఫరెంట్ పాత్రలు చేయడంలో ప్రస్తుత తరం లో ఉన్న స్టార్ హీరోలలో ముందుంటాడు మాస్ మహారాజా రవితేజ. ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు అదే రీతిలో దర్శకులు ఇష్టపడే హీరోగా.. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ అన్న తరహాలో గ్యారెంటీ ఉండే హీరోగా గుర్తింపు దక్కించుకున్న రవితేజ.. ఇటీవల కొద్ది సంవత్సరాల క్రితం కెరీర్ పరంగా అనేక ఎత్తుపల్లాలు చూడటం జరిగింది.
రాజా ది గ్రేట్ సినిమా రాకముందు వరుస ఫ్లాపులు చూసిన రవితేజ అప్పట్లో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమా స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ అందుకున్న తర్వాత అనేక సినిమాలు చేయగా మొత్తం అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వైరస్ రావడంతో ఆ టైంలో.. తన కెరీర్లో అంతకుముందు డాన్ శీను, బలుపు వంటి విజయాలు అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసి మళ్లీ హిట్ అందుకుని ప్రస్తుతం.. సక్సెస్ ఫుల్ హీరోగా మళ్లీ కొనసాగుతున్నాడు.
Read more: Ravi Teja: మంచి స్పీడ్ మీద ఉన్న మాస్ రాజా రవితేజ..!!
ఇటువంటి తరుణంలో తాజాగా రవితేజ.. ఒకపక్క కిలాడి సినిమా చేస్తూనే మరో పక్క కొత్త ప్రాజెక్టులు ఒకే చేస్తున్నాడు. దీనిలో భాగంగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల ఓకే చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చేయని పాత్ర చేయబోతున్నారట. విషయంలోకి వెళితే సినిమాలో ఎమ్మార్వో పాత్రలో రవితేజ నటిస్తున్న ట్లు సమాచారం. మాస్ నేపథ్యంలో.. స్క్రిప్టు ఉన్నట్లు సరిగ్గా రవితేజ కి సరిపోయే రీతిలో శరత్ మండవ.. స్టోరీస్ సెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ సరసన.. మజిలీ ఫేమ్ హీరోయిన్ దివ్యన్ష.. నటించనున్నట్లు సమాచారం. క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం రవితేజ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ తరుణంలో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!