ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాత అయిన ఎం.ఎస్ రాజు వాన చిత్రంతో దర్శకుడిగా మారాడు. అయితే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇప్పుడు ‘డర్టీ హరి’ అనే ఒక రొమాంటిక్ ఫిలిం తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. శ్రావణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్, అజయ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…
కథ
హరి (శ్రావణ్) ఒక యంగ్ చెస్ క్రీడాకారుడు. ధనవంతురాలైన వైదేహి (రుహానీ) అతనితో తొలి చూపులోనే ప్రేమలో పడి వెంటనే పెళ్లి చేసుకుంటుంది. అయితే హరి మాత్రం జాస్మిన్ (సిమ్రత్) అనే ఒక అమ్మాయి పైన మోజు పడతాడు జాస్మిన్ సినిమాల్లో కథానాయికగా ఎదగాలి అని అనుకుంటుంది. హరి ఆమె తో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఎట్టి పరిస్థితుల్లో వైదేహి నుండి వచ్చే ఆస్తిని కావాలి అనుకుంటాడు. అయితే జాస్మిన్ మాత్రం వైదేహి కి విడాకులు ఇచ్చేస్తే మనం ఇద్దరం కలిసి ఉందాం అని పట్టు పడుతుంది. అక్కడినుండి కథ ఎలా తిరిగింది అన్నది సినిమా.
ప్లస్ లు
ప్రధానపాత్రధారుల పర్ఫార్మెన్స్
రొమాంటిక్ సన్నివేశాలు
పరవాలేదనిపించే సినిమాటోగ్రఫీ
ఫైనల్ ట్విస్ట్
మైనస్ లు
రొటీన్ కథ
అజయ్ ఒకే ఒక్క సీన్ లో ఉండడం
హీరో క్యారెక్టర్ ను సరిగ్గా చెప్పలేక పోవడం
ఎమోషన్స్ మిక్స్ చేయడం
సాగతీసిన క్లైమాక్స్
విశ్లేషణ
మామూలుగా ఏటీటీ ప్లాట్ ఫార్మ్ సినిమాలు… అందులో రొమాంటిక్ కథలు అంటే రామ్ గోపాల్ వర్మ తీసే చిత్రాలు లాగా ఉంటాయి అని అనుకుంటారు. అయితే మరి మాత్రం ఖచ్చితంగా అటువంటి సినిమా కాదు. రొటీన్ కథతో ముందుకు వచ్చినా ఇందులో కొన్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే క్యారెక్టర్ల మనస్తత్వాన్ని సరిగ్గా చెప్పలేక పోవడం లవ్, లాస్ట్ అనే రెండు వేరు వేరు ఎమోషన్స్ ను కలిపేందుకు ప్రయత్నించి దర్శకుడు పెద్ద తప్పు చేశాడు అనే చెప్పాలి. అక్రమ సంబంధం పెట్టుకునేందుకు పెద్దగా సమయం పట్టకపోవడం… హీరో భార్య పాత్రను కావాలనే తగ్గించడం చాలా పెద్ద పొరపాటు అని చెప్పాలి. చివర్లో వచ్చిన ట్విస్టు వల్ల సినిమా పర్వాలేదు అనిపిస్తుంది కానీ దాన్ని డీల్ చేయడంలో ఎం.ఎస్.రాజు ఘోరంగా విఫలమయ్యాడు. ఇక రొమాన్స్ ను మరి ఓవర్గా లేకుండా క్లాస్ టేకింగ్ తో చూపించడం బాగుంటుంది.
చివరి మాట : డర్టీ హరి.. కొంచెం శ్రద్ధ పెట్టుంటే… వర్తీ హరి అయ్యేది.