NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

ఆర్జీవి ‘పవర్ స్టార్’ ట్రైలర్ రివ్యూ : వర్మ మామూలోడు కాదు..! అందరినీ టచ్ చేశాడు

వివాదాస్పద దర్శకుడు ఆర్జివి తన ఏటిటి ప్లాట్ ఫామ్ శ్రేయస్ ఈటీ మరియు ఆర్జివి వరల్డ్ థియేటర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర అని పవర్ స్టార్ అనే ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శర వేగంగా పూర్తిచేసుకున్న ఈ చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్లో విడుదల కాగా ఆ ట్రైలర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఏంటి…. అసలు అందులో ఏముంది…. అసలైన కాన్సెప్టు ఏంటి? ఎవరెవరిని టార్గెట్ చేశారు అనే విషయంపై చర్చించుకుంటే

 

RGV Power Star Trailer Update | Power Star Movie Official Trailer ...

ట్రైలర్ కాన్సెప్ట్

మొదట పవన్ కళ్యాణ్ పేరును ఇటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) గా ఆర్జివి మార్చుకున్నాడు. ఆ తర్వాత ముందుగానే చెప్పినట్లు పవర్ స్టార్ అనే చిత్రం ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రకు సంబంధించిందే. ఇక మొదటి సీన్ కి వచ్చేటప్పటికీ ప్రవన్ కళ్యాణ్ తన ఎన్నికల గుర్తు టీ గ్లాసు పట్టుకుని కూర్చుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఎన్నికల్లో తాను ఘోర పరాజయం చెందిన న్యూస్ చూస్తుంటాడు. ఆర్జీవీ ఆయనకు ఒక్క సీటే వచ్చింది అని.. రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క చోట కూడా గెలవడు గెలవలేదు అని కూడా గుర్తు చేస్తాడు. ఆ తర్వాత ప్రవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల పడిన వేదన, అనుభవించిన నరకయాతన ఇదే అంటూ ఆర్జివి పవర్ స్టార్ ఇక్కడ రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే విషయంపై తాను ఒక కంక్లూజన్ ఇచ్చేటట్లు చూపించడం గమనార్హం.

 

RGV Power Star Trailer - TV9 Telugu

ఇంట్రెస్టింగ్ పాత్రధారులు

ముందుగా ప్రవన్ కళ్యాణ్…. జనసేన పార్టీ పెట్టిన తర్వాత అతనికి చేదోడువాదోడుగా నిలుస్తున్న నాదెండ్ల మనోహర్ తో తన ఎన్నికల ఓటమి విషయమై గట్టిగా మాట్లాడడం…. తర్వాత చంద్రబాబు ప్రవన్ ను కలిసి నేను మీ ఓటమి పట్ల నేను ఎంతో బాధ పడుతున్నాను అని చెబితే నాకు ఎంతో మంది నిన్ను నమ్మవద్దు అన్నారు దయచేసి వెళ్లిపో స్వామి అని పవన్ చంద్రబాబుని అంటారు. ఆ తర్వాత అసలైన క్యారెక్టర్ చిరంజీవి లోనికి ఎంటర్ అయి ఇప్పుడు చెప్పు కళ్యాణ్ నువ్వు కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగావా లేకపోతే చిరంజీవి తమ్ముడిగా ఎదిగావా అని సూటి ప్రశ్నలు వేయడం గమనించవచ్చు. ఇలాగే కత్తి మహేష్, బండ్లగణేష్ మరియు పవన్ భార్య అన్నా లేజ్నేవా ను కూడా చూపించడం గమనార్హం. ఇకపోతే ఫోన్లో పూనమ్ కౌర్ ప్రవన్ కు ఫోన్ చేసినట్లుగా ఆర్జివి చిత్రీకరించడం ఇక్కడ చాలా పెద్ద వ్యవహారం అని చెప్పాలి.

 

Crazy Ram Gopal Varma makes Pawan Kalyan fans pay Rs 25 to watch ...

తగిలే డైలాగులు ఇవే

ప్రవన్ : ఒక్క సీటు…. ఒక్క సీటు కూడా రాలేదా

నాదెండ్ల : వచ్చింది ఒకటే సీటు కానీ…. మీకు ఒక్కటి కూడా రాలేదు

చిరంజీవి : ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయింది కానిస్టేబుల్ కొడుకుగానా…. నా తమ్ముడి గానా?

ప్రవన్ : (చంద్రబాబు తో) మిమ్మల్ని నమ్మొద్దు నమ్మొద్దు అని చాలా మంది చెప్పారు మీకు ఒక దండం సామి ప్లీజ్ సార్ దయచేసి వెళ్ళండి.

కత్తి మహేష్ : మీరు ఎన్నికల ప్రచారంలో గగన్ (జగన్) సిఎం కాడు ఇది నా శాసనం అని బాహుబలి శివగామి రేంజ్ లో రంకెలువేశారు ఇప్పుడు చూస్తే పరిస్థితి మారిపోయింది.

ప్రవన్ : ఎన్నికలకు ముందు మా లీడర్లు ఏవేవో అనుకుంటాం అవి పట్టించుకోవడానికి జనాలకి బుద్ధి ఉండక్కర్లే….?

బండ్ల గణేష్ వచ్చి ప్రవన్ తో…. మీరు ఎన్నికల్లో ఓడిపోతే 100 కొబ్బరికాయలు కొట్టి మీ పేరుమీద గుడిలో అర్చ చేయిస్తానని మొక్కుకున్నాను…. మీరు ఎన్నికల్లో గెలిచి సీఎం అయితే సినిమాలు చేయరు.. నేను ప్రొడ్యూసర్ గా మీరు తప్ప నాతో ఎవరు సినిమాలు చేయరు అప్పుడు నా బతుకు బస్టాండ్ అవుతుంది అని అంటాడు.

చివరిగా ప్రవన్ బాడీగార్డ్ పూణే నుండి ఫోన్ వచ్చింది అని ఆయన మాజీ భార్య ను ఉద్దేశించి అతని ఫోన్ ఇవ్వబోతే అతని భార్య అన్నా పవన్ తో  తన రష్యన్ భాషలో కోపంగా మాట్లాడుతుంది. దానికి పవన్ ” ఫోన్ చేసింది నేను కాదు కదా.. అక్కడి నుండి ఫోన్ వచ్చింది” అని కోపంగా అరుస్తాడు.

 

RGV'S POWER STAR Movie First Look | Ram Gopal Varma | Power Star ...

 

సినిమా చూడొచ్చా…?

ఇక ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక జీవిత చరిత్ర చెప్పడానికి ఎంత పట్టుదలగా ఉన్నాడో.. మరి ఎంత లోతుగా స్టడీచేశాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ థియేటర్ లో కాదు కాబట్టి పవన్ అభిమానుల ఆవేశం, ఆగ్రహం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. అయితే ఇటువంటి ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్, ఎలిమెంట్స్ పెట్టి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో జనాలకు క్లారిటీ గా చెప్పేశాడు వర్మ.. ఇక సినిమా చూసేది లేనిది మీ ఇష్టం అన్నట్లు ఉంది ఉంది ఈ ట్రైలర్.

 

https://youtu.be/yxxHaKvxBIA

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu