సిడ్నీ టెస్ట్ కు రోహిత్ దూరం

అత్యంత కీలకమైన సిడ్నీ టెస్ట్ కు భారత్ కీలక ప్లేయర్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వచ్చే నెల 3న సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2-1 ఆధిక్యతతో ఉన్న కోహ్లీ సేన..సిడ్నీ టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నది.

విదేశీగడ్డపై విజయం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న కోహ్లీ సేనకు రోహిత్ అందుబాటులో ఉండడన్న వార్త ఒకింత కలవర పరిచేదే అనడంలో సందేహం లేదు. రోహిత్ భార్య రితిక నిన్న పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి అయన ఆనందాన్ని భార్యతో పంచుకునేందుకు రోహిత్ జట్టును వీడి స్వదేశానికి బయలుదేరడంతో నాలుగో టెస్ట్ కు అందుబాటులో ఉండటం లేదు.