మన తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లైన తర్వాత హీరోయిన్ లు సినిమాలకు దూరం అయ్యి పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ద్రుష్టి పెడుతుంటారు. ఒకవేళ వారు తరువాత ఏ సందర్భంలోనైనా కనిపిస్తే చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. కానీ పెళ్లి తరువాత కూడా తనలో ఏ మార్పు రాలేదని మరోసారి నిరూపించింది టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని.
తాజాగా సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కాస్త హాట్ హాట్‌గా అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇంకొక విషయం ఏమిటంటే కాస్త పద్దతిగా కనిపిస్తూనే కావాల్సిన అందాలను ఆరబోస్తూ కనిపించింది ఈ బ్యూటీ. సమంత పెళ్లి తర్వాత కొన్ని రోజులు పద్దతిగానే కనిపించింది మరియు ఎక్కడికి వచ్చినా కూడా పద్దతిగానే వచ్చేది. అక్కినేని కోడలు హోదాలో చాలా ట్రెడీషనల్గా ఉంటూ సినిమాల్లో కూడా ఇలాగే కనిపించేది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలతో మతులు చెడగొట్టేసింది.
పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదు కానీ పెళ్లి తరువాత అంతటి పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్ళాక ఇలా ఎలా ఉండగలుగుతోందో సమంత అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటువంటి విమర్శలకు ఇంకేముందు ఒకసారి స్యామ్ స్పందిస్తూ ఎంతైనా తనకు నచినట్టే ఉంటానని ఈ విషయంలో ఎవరి సలహాలు తనకు అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది స్యామ్.
ఇపుడు సమంత తాజాగా పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ డిస్క్రిప్షన్ లో దేనికైనా రెడీ అంటూ 2021ను ఆహ్వానిస్తూ సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగానే ఉంది. తెలుగులో అంతగా సినిమాలు అయితే ఒప్పుకోవడం లేదు కానీ డిజిటల్ మీడియాలో మాత్రం స్యామ్ దూసుకుపోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!