హీరోయిన్‌గా క్లిక్ అవ్వడానికి కేవలం ఒకే ఒక్క సినిమా చాలంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్లామరస్ హీరోయిన్లకు సినీ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఏర్పడింది. ఇక మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న చాలా మంది హీరోయిన్లు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆ కోవకు చెందిందే నార్త్ ఇండియన్ బ్యూటీ షాలిని పాండే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. అయితే సినిమా తర్వాత షాలిని పాండేకు ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేకపోయాయి. దాంతో కెరీర్ పూర్తిగా డ్రాాపౌట్ అయింది. దాంతో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేసింది. తన అందాలను ఆరబోస్తూ.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలుస్తోంది. అయితే షాలిని పాండే గురించి మనం ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆమె జననం, వయసు, విద్యాభ్యాసం, సినీ ప్రస్థానం, అవార్డులు తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

షాలిని పాండే జననం, విద్యాభ్యాసం..
1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో షాలిని పాండే జన్మించారు. ప్రస్తుతం షాలిని వయసు 29 సంవత్సరాలు. ఆమె విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తయింది. జబల్‌పూర్‌లోని జబల్‌పూర్ గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం నుంచే నాటకాలపై ఆసక్తి పెరిగింది. నటనపై ఉన్న ఆసక్తితోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

టాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ..
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా షాలిని పాండే ఎంట్రీ ఇచ్చింది. 2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా హీరోగా విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. రూ.5.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. రూ.51 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో షాలిని పాండేకు ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరో సరసన చేరాడు. షాలిని పాండేకు కూడా వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తెలుగులో ‘మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం’ వంటి సినిమాల్లో నటించింది.
హీరో కళ్యాణ్ రామ్, రాజ్ తరుణ్ లాంటి హీరోలతో కలిసి నటించినా.. అర్జున్ రెడ్డి సినిమా లాంటి సక్సెస్‌ను షాలిని అందుకోలేకపోయింది. దాంతో ఈ భామకు టాలీవుడ్‌లో అవకాశాలు రావడం తక్కువయ్యాయి. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. బాలీవుడ్‌లో ‘మేరి నిమ్ము, బాంఫడ్, జయేశ్ భాయ్, జోర్దార్, మహారాజా’ సినిమాల్లో నటించింది.

సోషల్ మీడియాలో గ్లామర్ డోస్..
బాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌కి జోడిగా నటించినా షాలికి పాండే సినిమాకు క్రేజ్ రాలేదు. బాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు అంతంత మాత్రానా రావడం మొదలయ్యాయి. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గినా.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షాలిని పాండే గ్లామర్ షోకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు 2 మిలియన్ ఫాలొవర్స్ ఉన్నారు. ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలకు లక్షల్లో లైక్స్, వ్యూవ్స్ వస్తుంటాయి. గ్లామర్ డోస్ విషయంలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతుంది. హాట్ డ్రెస్సుల్లో కుర్రకారు మతి పొగొడుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో ఈ భామ చబ్బీగా కనిపించేది. కానీ ఇప్పుడు జీరో సైజ్ మెయిన్‌టైన్ చేస్తూ అందాలను ఆరబోస్తుంది. మిలియన్లలో ఫాలొవర్స్ పెంచుకోవడంతో పాటు ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో గుగూల్‌లో షాలిని పాండే పేరును అధికంగా సెర్చ్ చేశారు. దాంతో షాలిని పాండే ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది.