NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

షాకింగ్.. యుగాంతం రాకుండా చేసిన చందమామ.. నాసా పరిశోధనలో సంచలన విషయాలు!

యుగాంతం రాబోతోంది, ఇక ఈ భూమి అంతమవుతుందని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలు మనం చూసినవే. యుగాంతం వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని సినిమాలు కూడా బాగానే చూపించాయి. అలాంటి ప్రమాదం నుంచి భూమిని చందమామనే కాపాడిందని నాసా పరిశోధనలో తేలింది.

చల్లని హాయిని పంచే చందమామకు సంబంధించి అమెరికా ఏజెన్సీ నాసా ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. ఇప్పటికీ 350 ఏండ్ల కిందట భూమిని చందమామే కాపాడిందని స్పష్టం చేసింది. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం కూడా చందమామేనట. అదేలాగంటే ఒకప్పుడు చంద్రుడికి బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ (అయస్కాంత క్షేత్రం) ఉండేది.

అది సూర్యుని నుంచి భూమిపై పడే అతి ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడిందని నాసా పరిశోదనలో తేలింది.అప్పట్లో భూమిపై జీవరాశి ఇంకా లేదు. అంటే అది ప్రారంభ దశగా చెప్పుకోవచ్చు. అప్పటినుంచే చందమామ భూమిని కాపాడటం మొదలు పెట్టాడు. క్రీస్తు పూర్వం 410 కోట్ల ఏండ్ల నుంచి 350 కోట్ల సంవత్సరాల వరకూ.. చందమామ, భూమి రెండూ ఒకే అయస్కాంత క్షేత్రాన్ని కలిగి వున్నాయని నాసా తెలిపింది.

ఈ పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే అప్పట్లో సౌర గాలులు చాలా ప్రమాదకరంగా ఉండేవని, వాటి నుంచి భూమిపై ఉండే వాతావరణం నాశనం కాకుండా చందమామకు చెందిన అయస్కాంత క్షేత్రమే కాపాడిందని నాసా చీఫ్ సైంటిస్ట్ జిమ్ గ్రీన్ తెలిపారు. ‘ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా… మేం వ్యోమగాములను చందమామపైకి పంపామని పంపాం. వాటి నుంచి చందమామ దక్షిణ ధ్రువం నుంచి కొన్ని శాంపిల్స్ తెచ్చారని వివరించారు. వాటిని పరిశోధించినప్పుడు ఈ విషయం తెలిసిందని ఆయన వివరించారు.

ఈ కొత్త పరిశోధనలో సరికొత్త విషయాన్ని కూడా తెలిపారు. చందమామపై ఒకప్పడు పవర్ ఫుల్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేదని తెలిపారు. భూమి చుట్టూ ఈ అయస్కాంత క్షేత్రం ఉండటం మూలంగానే యూరప్ దేశాలు, ఆర్కిటిక్ , అంటార్కిటిక్ ధృవాల్లో ఆకాశంలో రంగురంగుల అరోరాలు కనిస్తున్నాయని తెలిపారు. అయస్కాంత క్షేత్రం భూమిపై, చందమామపై ఎలా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి సైంటిస్టులు కంప్యూటర్ మోడల్ ను తయారుచేశారు. దీని ద్వారా వారి పరిశోధను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.

320 కోట్ల ఏండ్ల నుంచి చందమామపై అయస్కాంత క్షేత్రం క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 150 కోట్ల ఏండ్ల కిందట అది పూర్తిగా మాయమైంది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే చందమామ గనక మన భూమిని కాపాడకపోయుంటే ఇప్పటికే భూమి ఎప్పడో అంతరించి ఉండేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju