Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనుసూద్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. దాదాపు 60 రోజులకు పైగానే గేమ్ సాగుతూ ఉండటంతోపాటు.. ఇంటిలో సగంమంది ఎలిమినేట్ అయిపోయారు. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ ఫైవ్ ప్రారంభం నుండి ఇంటిలో ఉండే సభ్యులకు బయట సెలబ్రిటీలు మద్దతు తెలపడం జరిగింది. ట్రాన్స్ జెండర్ పింకీ నాగబాబు(Nagababu) సపోర్ట్ ఉండగా మానస్(Manas) కి.. కుర్ర హీరో తనీష్ తో పాటు సందీప్ కిషన్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో యాంకర్ రవి(Ravi) కి అలీ రెజా(Ali Reza).. మరికొంత మంది సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే సింగర్ శ్రీరామ్ (Sri Ram)కి..నోయెల్(Noyel) ఆల్రెడీ సపోర్ట్ చేయటం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సోనూసూద్ కూడా సింగర్ శ్రీరామ్ … తెలుగు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. తన ఫేవరెట్ కంటెస్టెంట్ అని ప్రతి ఒక్కరు అతనికి సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చాడు.

Sonu Sood : ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు మద్దతు తెలిపిన సోనూసూద్.. ఆనందంలో  అభిమానులు! - India Daily Live

సోను సూద్ ప్రత్యేకంగా శ్రీరామ్ కోసం సోషల్ మీడియాలో వీడియో సందేశం ఇచ్చారు. దీంతో సోనుసూద్ సపోర్ట్.. శ్రీ రామ్ కి రావడంతో.. ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శ్రీరామ్ అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. సోను సూద్ కి దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ తాజాగా ఏర్పడిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో ఉన్న సమయంలో విలన్ పాత్రలు చేస్తూ మరో పక్క క్యారెక్టర్ సపోర్ట్ పాత్రలు చేస్తూ ఉండగా అప్పట్లో.. కొద్దిపాటి ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇటీవల మహమ్మారి కరోనా వచ్చిన సమయంలో చాలా మంది బాధితులకు అండగా నిలబడ్డాడు సోనుసూద్. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు ప్రత్యేకంగా ట్రైన్లు బస్సులు నిర్మాణాలు పెట్టి వారిని గమ్యస్థానాలకు చేర్చాడు. అనంతరం తన సేవా కార్యక్రమాలు ఆగిపోకుండా దేశవ్యాప్తంగా పలు పేద ప్రజలకు చదువు సహాయం చేస్తూ మరో పక్క ఉపాధి లేని వారికి ఉద్యోగం కల్పిస్తూ.. అనేక రీతులుగా తన ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో అనేక మంది ఆక్సిజన్ లేక మరణిస్తున్న తరుణంలో సోను సూద్… చాలా మంది ప్రాణాలను కాపాడటం జరిగింది.

శ్రీరెడ్డి చాట్ తో పడిపోయిన శ్రీరామ్ గ్రాఫ్.. సోనూ సూద్ సపోర్ట్ తో  పెరుగుతుందా..!? | Bigg Boss 5 Updates: Actor Sonu Sood Supports Singer  Sreerama Chandra in Bigg Boss 5 Telugu

శ్రీరామ్ చంద్ర సీజన్ ఫైవ్ లో గెలవాలని

దీంతో మనోడు దేశవ్యాప్తంగా ఆరాధ్య దైవంగా మారిపోయాడు. సోనుసూద్ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగి పోయాడు. ఇటువంటి తరుణంలో సోనూసూద్ ప్రత్యేకంగా సింగర్ శ్రీరామ్ చంద్ర సీజన్ ఫైవ్ లో గెలవాలని ప్రతి ఒక్కరు గెలిపించాలని.. అతనికి సపోర్ట్ గా నిలవాలని.. వీడియో సందేశం పంపటంతో కచ్చితంగా శ్రీరామ్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు.. ఉన్నాయని .. సోనూసూద్ కు సపోర్ట్ తో మరింతగా టైటిల్ గెలిచేది తరహాలో శ్రీరామ్ ప్రయాణం ఎక్కడినుండి ఉంటుందని బయట జనాలు చెప్పుకుంటున్నారు. సోనూసూద్ ఇలాంటి దేశవ్యాప్తంగా అభిమానం కలిగిన వ్యక్తి మద్దతు తెలపడంతో ఇక శ్రీరామ్ ప్రయాణానికి ఎటువంటి అడ్డంకి ఉండదని కచ్చితంగా టైటిల్ విన్నర్ శ్రీరామ్ యే అని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో.. ఎక్కడా కూడా గ్రూప్ గేమ్ ఆడకుండా.. శ్రీరామ్ రాణిస్తున్నాడు. సింగిల్ పర్ఫామెన్స్ తో… టాస్క్ పరంగా మరోపక్క ఫిజికల్ టాస్క్ వచ్చినా గాని ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అన్ని రీతులుగా.. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు. పైగా సింగర్ గా బయట మంచి క్రేజ్ ఉండటంతో పాటు తాజాగా సపోర్టు ఇవ్వడంతో హౌస్ లో కూడా బాగా ఆడుతూ ఉండటంతో.. కచ్చితంగా శ్రీరామచంద్ర టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. సోను వీడియో తర్వాత సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

Karnataka: కర్నాటకలో కథాకళి..! సీఎం యెడియూరప్పకు పదవీ గండం ఉన్నట్టా..? లేనట్టా..?

somaraju sharma

Anushka: ఏంటీ.. అనుష్క నిర్మాతలను ఇంత ఇబ్బంది పెడుతుందా!!

Naina

ఇదే సరైన సమయం అంటున్న రానా..!!

sekhar