వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ..!

వరుణ్ తేజ్ .. మెగా వారసుడిగా ముకుంద సినిమాతో టాలీవుడ్ లో ఎంటరయినప్పటికి రెండవ సినిమా నుంచి తన సొంత నిర్ణయాలతోనే సినిమాలని ఎంచుకుంటూ స్టార్ డం ని సంపాదిచుకున్నాడు. మొదటి సినిమా నుంచి విభిన్నమైన కథలని ఎంచుకుంటున్న varun tej కెరీర్ లో ఎక్కువగా సూపర్ హిట్స్ ఉండటం విశేషం. కంచె, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, లోఫర్, గద్దల కొండ గణేష్ ఇలా ప్రతీ సినిమాని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.

ప్రస్తుతం varun tej నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 ఒక సినిమా కాగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మరో సినిమా ‘VT 10’. ఈ రెండు సినిమాలు రెండు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం varun tej ఒకవైపు వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చేస్తూనే మరొక వైపు బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘VT 10’ ని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ లో ఉన్నాడు varun tej.

కాగా ఈ నెల 19 న ఈ మెగా ప్రిన్స్ varun tej బర్త్ డే కావడం తో ఈ సందర్భంగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో 10 వ సినిమాగా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు వెంకటేవ్(బాబీ) – సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. కొర్రపాటి కిరణ్ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. varun tej కి జంటగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. కాగా జనవరి 19న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.