NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ టిడిపి ఫార్ములా ను అనుసరిస్తున్న టీ-కాంగ్రెస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తన కీలక ఓటు బ్యాంకు అయినా బీసీలను కాపాడుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగింది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు బీసీ వర్గాల నాయకులను అదేవిధంగా ప్రజలకి సరైన న్యాయం చేయకపోవడంతో 2019 ఎన్నికల్లో చాలావరకు బీసీలు జగన్ కి ఓటు వేయడం జరిగింది.

Lok Sabha Elections 2019: Congress-TDP may unite again in Telanganaఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలు కూడా ఒప్పుకుంటారు. ఈ క్రమంలో జగన్ అధికారంలోకి వచ్చి చాలావరకు బీసీ నేతలకు మరియు ప్రజలకు సంక్షేమ పథకాలలో తన పాలనలో పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకేంటి చంద్రబాబు బీసీలను కాపాడుకోవడం కోసం ఇటీవల పార్టీ తరఫున ప్రకటించిన కమిటీలలో ఆ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ పదవులను అప్పజెప్పడం జరిగింది.

 

సరిగ్గా ఇప్పుడు ఏ పి టి డి పి బీసీల విషయంలో అనుసరించిన వైఖరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి అని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఒకపక్క న్యాయపోరాటం చేస్తూనే మరోపక్క రాజకీయంగా ఎదుర్కోవటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. క్షేత్రస్థాయి పోరాటాలు కు రంగం సిద్ధం చేసింది పిసిసి కోర్ కమిటీ. దుబ్బాక ఉప ఎన్నికల సమరం విజయంతో నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాన్ని టార్గెట్ గా పెట్టుకుని టీ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఓవైపు న్యాయపరంగా రిజర్వేషన్ విషయంలో కోర్టులో పోరాడటం తో పాటు ఉప ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాలని టీ కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. జానారెడ్డి చెన్నా రెడ్డి మద్దతు పలికారు. ఇదే క్రమంలో క్షేత్రస్థాయి ఆందోళనకు సిద్ధమయింది కాంగ్రెస్ పార్టీ. ఈనెల ఏడవ తారీఖున రాష్ట్రంలో మహిళలపై దళితులపై జరిగిన దాడులకు సంబంధించి నిరసన చేపట్టనుంది. అదే విధంగా కేంద్రం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కూడా ఆందోళన చేయడానికి టీ.కాంగ్రెస్ రెడీ అవుతోంది. అదేవిధంగా రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఈనెల 12వ తారీకున కూడా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి టీ-కాంగ్రెస్ రెడీ అయినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఏపీలో టీడీపీ అనుసరిస్తున్న బిసి జపాన్ని టీ కాంగ్రెస్ అనుసరిస్తూ మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతూ సత్తా చాటడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju