భారత కార్ మార్కెట్లో ఎన్నో మార్పులు , మరెన్నో కొత్త కంపెనీలు పుట్టుకురావడం తో కొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.. కొత్త వాహనాల రాకతో పాత వాహనాల ఉత్పత్తి నిలిచిపోవడం షరా మామూలే.. అయితే ఇలాంటి వాహనాల్లో కొన్ని మోడల్స్ హృదయాలకు హత్తుకునేలా ఉంటాయి.. అలాంటి వాటిల్లో టాటా సఫారీ కూడా ఒకటి.. ఇది టాటా మోటార్స్ కి కాసుల వర్షం కురిపించింది.. ఒకప్పుడు మార్కెట్ ను షేక్ చేసిన టాటా సఫారీ దేశంలో మొట్టమొదటి ఎస్ యూవి లలో ఒకటైన ఐకానిక్ సఫారీ. ఈ బ్రాండ్ ను సరికొత్తగా మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావాలని టాటా మోటర్స్ భావిస్తోంది. గతేడాది ఈ మోడల్ ఉత్పత్తిని ఆపేసిన సంగతి తెలిసిందే. కొత్త సఫారీ మోడల్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
టాటా గ్రావిటీస్ సఫారీ ప్రాజెక్ట్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు వివరించింది. దేశీయ మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ అయిన సఫారీని తిరిగి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉంది. ఐకానిక్ బ్రాండ్ కొత్త డిజైన్, ఫీచర్స్ తో రానుంది. రెండు దశాబ్దాలు గా ఎస్ యూవి ఉత్పత్తి దశలో ఉంది. టాటా సఫారీ మంచి ప్రజాధారణ పొందటమే కాకుండా మంచి లాభాలను కంపెనీకి అందించింది.
టాటా ఉత్పత్తుల్లో ఒకప్పుడు ఇదే టాప్ ఆఫ్ ది టాప్ లైన్ మోడల్ గా నిలిచింది. అంతటి పాపులారిటీ దక్కించుకున్న టాటా సఫారీ టాటా మోటార్స్ ఒకసారి గుర్తు చేసుకుంది. నీవు మాకు ఇచ్చిన విజయాలు అన్నీఇన్నీ కావు. నీతో మాకున్న జ్ఞాపకాలు వెలకట్టలేనివి. వుయ్ మిస్ యూ అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.. టాటా మోటార్స్ టాటా సఫారీ కి నివాళి గా (ట్రిబ్యూట్) గా ఒక వీడియోను కూడా విడుదల చేసింది.. టాటా మోటార్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని షేర్ చేసింది. టాటా విడుదల చేసిన వీడియో లో టాటా సఫారీ లో చేసిన మార్పులు , సాధించిన విజయాలు, కస్టమర్లతో దాని అనుబంధాన్ని తెలిపే చిత్రాలు మొదలైనవి అందులో ఉన్నాయి. అంతేకాకుండా టాటా సఫారీ పనితీరు కూడా ఇందులో జతచేశారు. టాటా సఫారీని మళ్ళీ రానుంది అంటూ కంపెనీ భావిస్తోంది..