NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

తెలుగు సినిమా చీకటి కోణం..! పూరి Vs ఎక్సిబిటర్స్: లైగర్ నేర్పిన పాఠం..!

తెలుగు సినిమా రంగం చాలా పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనం జూదం ఆడితే, పేకాట ఆడితే తప్పు. ఎందుకంటే..? డబ్బులు పెడ్డి ఆడతాము.. ! పోతాయి.. ! వస్తాయి.. ! పల్లెల్లో జాతరల సమయంలో లాటరీలు పెడుతుంటారు. లాటరీ లు ఆడటం కూడా తప్పే. వీటిని జూద క్రీడలు అంటారు. మరి సినిమా అనేది జూదం కాదా..?  సినిమా అనేది పూర్తిగా వ్యాపారం (బిజినెస్). అది వ్యాపారమే కానీ జూదం లాంటి వ్యాపారమే అని అనాల్సి వస్తుంది. ఉదాహారణకు.. ‘లైగర్’ సినిమా. ఆ సినిమా ప్లాప్, ఆ సినిమా కు పెట్టిన పెట్టుబడి, ఆ సినిమాకు వచ్చిన నష్టాలు ఇప్పుడు పూజి జగన్నాధ్ కు ఎక్సిబిటర్ లకు, ఫైనాన్షియర్స్ కు జరుగుతున్న వివాదం మనం చూస్తుంటే కచ్చితంగా సినీ రంగం ఒక జూదమే అని పేర్కొనవచ్చు.

Puri Jagannath

రీసెంట్ గా పూరి జగన్నాధ్ కు సంబందించి ఆడియో ఒకటి బయటకు విడుదల అయ్యింది. ఇది చాలా మంది విన్నారు. దాని కంటే ముందు సినిమా ఎక్సిబిటర్ లు ఫైనాన్షియర్ల ఆడియో మెసేజ్ వచ్చింది. అది ఏమిటంటే.. “పూరి జగన్నాధ్ ఆఫీసు ముందు మనం అందరం ధర్నా చేయాలి. అందరూ రావాలి. ఎవరెవరైతే రారో వాళ్లను అసోసియేషన్ నుండి బయట పెడతాము, వాళ్లకు మేము తీసే సినిమాలు ఇవ్వము” అంటూ మెసేజ్ పెట్టారు. ‘లైగర్’ సినిమా ఫ్లాప్ కారణంగా పూరి జగన్నాధ్, ఫైనాన్షియర్లకు, బయ్యర్ లకు, ఎక్సిబిటర్లకు మధ్య వార్ జరుగుతోంది. అసలు ఈ వివాదం ఏమిటి. కారణం ఏమిటి.. ? పరిష్కారం ఏమిటి ..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..

Puri Jagannath

 

డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల మెసేజ్ లకు పూరి జగన్నాధ్ రియాక్ట్ అవుతూ విడుదల చేసిన ఆడియోలో ఇది “పూర్తిగా చట్టవిరుద్దం, ధర్నా చేయడానికి ఎవరికీ అనుమతి ఉండదు. నేను వాళ్లకు ఇస్తాను అని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇంత బలవంతంగా రుద్ది నష్టపోయిన డబ్బులను నన్ను అడుగుతున్నారు. కానీ పోకిరి నుండి ఇస్మార్ట్ శంకర్ వరకూ ఎన్నో సినిమాల్లో లాభాలు వచ్చాయి. ఆ లాభాల నుండి నాకు ఏమైనా తీసుకువచ్చి ఇచ్చారా..? నా దగ్గర సినిమా కొన్న డబ్బులు కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఈ మధ్యవర్తులు ఎవరైనా వాళ్ల నుండి వసూలు చేసి నాకు ఇవ్వగలరా. ? సో.. ఇప్పుటికీ నేను ఇస్తాను అన్నాను. కాకపోతే కొంత టైమ్ కావాలి. నేను ఇచ్చినప్పుడు తీసుకోండి అన్నట్లు చెప్పి ఎవరైతే ధర్నా చేయడానికి వస్తాను అన్నారో వారి పేర్ల లిస్ట్ రాసుకుని వాళ్లకు తప్ప మిగిలిన వాళ్లకు ఇస్తాను” అని కౌంటర్ గా చెప్పారు. చాలా పౌరుషంగా, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఇది కఛ్చితంగా సినిమాకు ఒక పాఠం.

వీటికి కారణాలు ఏమిటంటే..?  సినిమా బడ్జెట్ స్థాయికి మించి పెట్టేయడం. సినిమా స్థాయిని అమాంతం పెంచి వేయడం. ఒక చిన్న మీడియం రేంజ్ సినిమాను కూడా భారీ స్థాయికి ఎక్కువ డబ్బులు పెట్టేయడం. ఈ మధ్య హిట్ అయిన ‘శ్యామ్ సింగరాయ్’ చూసినట్లైయితే .. ఈ సినిమా హిట్ అయ్యింది. మంచి సినిమా. కానీ దానికి ఆశించినంతగా కలెక్షన్ రాలేదు అంటే నమ్మగలరా.. ?ఎందుకు అంటే.. ఆ సినిమాకు స్థాయికి మించి బడ్జెట్ పెట్టారు. 45 – 50 కోట్లు పెడుతున్నారు. అంత రావాలి అంటే ఆ హీరోకు ఉన్న మార్కెట్ ను బట్టి వస్తాయి. అలానే ఇప్పుడు సినీ రంగంలో వస్తున్న చాలా సినిమాల పరిస్థితి కూడా అదే పరిస్థితి. సినిమాలు హిట్ అయినా సరే పూర్తిగా డబ్బులు రాలేని పరిస్థితి కనబడుతోంది. దీని కారణం వాళ్ల స్థాయికి మించి డబ్బులు ఖర్చు పెట్టేసి, స్థాయికి మించి సినిమాను అమ్మేసి ఇదిగో మేము ఇంత ఖర్చు పెట్టాము, సినిమా రేటు ఇంత అని నిర్ణయిస్తున్నారు.

ఉదాహరణకు రూ.50కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకు ఒక్కో జిల్లాకు కోటి , కోటిన్నరకు, నైజామ్ లాంటి ఏరియాలో మూడు కోట్లు, మూడున్నర కోట్లకు ఇంకా ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. దీని వల్ల సినిమా రేటు పెరిగిపోతుంది. రేటు పెరిగిన తర్వాత అది అమాంతం థియోటర్ల మీద పడుతుంది. థియేటర్ల వార్లు ప్రేక్షకుల మీద వేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల కు ఒక ధర నిర్ణయించింది. లైగర్ విషయానికి వస్తే ఎక్సిబిటర్లు, బయ్యర్లు గానీ సినిమా కొన్నప్పుడు వాళ్లు పూర్తిగా సినిమా చూడరు. సినిమా ముందుగా చూస్తే అది ప్లాప్ అని తెలిస్తే కొనరుకదా. ? కేవలం ట్రైలర్ ను చూసి, సినిమా హంగులు, ఆర్భాటాలు, సినిమా కాస్ట్ తదితర విషయాలు చూసి ఒక రేటు నిర్ణయిస్తే దానికి కొంటారు. అంటే బ్లైండ్ గేమ్. కేవలం వాళ్లు సినిమా మీద అంచనాలు చూసి మాత్రమే కొంటారు. సాధారణ ప్రేక్షకుడు ఎటువంటి అంచనాతో సినిమాకు వెళతాడో అదే విధంగా ఎక్సిబిటర్, బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను అదే రేటు కు కొంటారు. సినిమాను ముందే వాళ్లకు చూపించరు.

అలాగే వాళ్లు కొన్నప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. 40 శాతం ఎక్సిబిటర్ కు అని, 60 శాతం బయ్యర్ కు అని ఉంటుంది. లేదు ఫైనాన్షియర్ గనక వాటా పెడితే వచ్చిన లాభాల్లో ఫైనాన్షియర్ కు కొంత వాటా అని ఉంటుంది. ఓవరాల్ గా ఎక్సిబిటర్ నుండి డిస్ట్రిబ్యూటర్ కలెక్ట్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ నుండి ఫైనాన్షియర్ కలెక్ట్ చేస్తారు. ఫైనాన్షియర్ నుండి ప్రొడ్యూసర్ కు వెళుతుంది. ఇలా ఒక అగ్రిమెంట్ ప్రకారం నడుస్తుంది. కానీ సినిమా ఫ్లాప్ అయితే ..డబ్బులు తిరిగి ఇవ్వాలి అని అగ్రిమెంట్ లో ఎక్కడా ఉండదు. కానీ రజనీకాంత్ ‘బాబా’ సినిమా నుండి సినిమాలు ప్లాప్ అయితే డబ్బులు తిరిగి ఇవ్వడం కొంత ఆనవాయితీగా వస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు డబ్బులు తిరిగి ఇచ్చారు. ‘అజ్ఞతవాసి’ గానీ, రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాకు కూడా కొన్ని చోట్ల డబ్బులు తిరిగి ఇచ్చారని టాక్. మహేష్ బాబు సినిమాలకు కూడా కొన్ని చోట్ల తిరిగి ఇచ్చారు. అలాగే పూరి జగన్నాధ్ లైగర్ సినిమా కు కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. తిరిగి ఇవ్వాలని అగ్రిమెంట్ లో రూల్ ప్రకారం లీగల్ గా ఉండదు.

కానీ వీళ్లు తిరిగి ఇవ్వకపోతే ఆ ఎక్సిబిటర్లు, డిస్టిబ్యూటర్లు నష్టపోతారు కాబట్టి మళ్లీ భవిష్యత్తులో వచ్చే సినిమాలు వాళ్లు కొనడానికి ఇష్టపడరు కాబట్టి ఆ ప్రభావం వేరే బయ్యర్ మీద, డిస్టిబ్యూటర్లపై ఉంటుంది కాబట్టి వాళ్లు డబ్బులు తిరిగి ఇస్తుంటారు. ఇది చట్టప్రకారం ఇవ్వక్కరలేదు కానీ నైతికంగా ఇస్తుంటారు. చట్టం వేరు. నైతికత వేరు. ఇప్పుడు లైగర్ సినిమా గానీ, తెలుగు సిని రంగం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు, ఎక్సిబిటర్లు నష్టపోతున్నారు అంటే దానికి కారణం సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడమే. సినిమా బడ్జెట్ ఎక్కువ కావడానికి కారణం ఏమిటంటే.. ఒక సినిమా హీరో కృత్రిమ మార్కెట్ సృష్టించి ఆ హీరో స్థాయికి మించి సినిమాలు తీసేస్తున్నారు.

సో.. సినిమా బడ్జెట్ తగ్గించుకుంటే .. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే.. సినిమా బడ్జెట్ లిమిట్ లో ఉంటే.. ఇటువంటి నష్టాలు తగ్గుతాయి. ఆచార్య సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక పెద్ద ఫ్లాప్. ఆ సినిమాకు భారీ లాస్ వచ్చింది. అలానే కొన్ని పెద్ద పెద్ద సినిమాలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇటువంటి జూద క్రీడలను ఆడేకంటే ఒక లిమిట్ లో బడ్జెట్ పెట్టుకుని ఒక లిమిట్ లో సినిమాలు తీసుకుని లిమిట్ లో అమ్మకుంటే వచ్చేది పోయేది లిమిట్ లో ఉంటే అందరూ సేఫ్ జోన్ లో ఉంటారు. ఇటువంటి మాఫియా ఎప్పటి నుండో తయారు అయినా అడ్డుకట్ట పడటం లేదు. పూరి జగన్నాధ్ ఈ వార్నింగ్ తో అయినా కొంత వరకూ కొత్త పాఠం నేర్చుకుంటారేమో, బడ్జెట్ తగ్గించుకుంటారేమో చూడాలి.

Munugode: బీజేపీ ఎందుకు గెలవదు ..? మునుగోడులో సెన్సేషన్ .. 5 మెయిన్ పాయింట్స్ ..!

author avatar
Special Bureau

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu