NewsOrbit
Featured న్యూస్ సినిమా

Naga Shaurya: లిస్ట్‌లో చాలా సినిమాలున్నాయి.. ఒక్కటైనా నాగ శౌర్య(Naga Shaurya)కి హిట్ ఇస్తుందా..?

Naga Shaurya: టాలీవుడ్‌లో అలా ఫ్లోలో వచ్చిన యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shaurya). చందమామ కథలు( Chandamama kathalu) సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి అసోసియేట్ త్రికోటి పేట దర్శకత్వంలో అజయ్ హీరోగా వచ్చిన సినిమా దిక్కులు చూడకు రామయ్య(Dikkulu chudaku ramayya), ఈ సినిమాతో పాటు ఊహలు గుస గుస లాడే(Uhalu gusa gusa laade) సినిమా చేసిన నాగ శౌర్య(Naga Shaurya) చేశాడు. ఈ రెండు సినిమాలు ఈ యంగ్ హీరోకి మంచి పేరు తీసుకువచ్చాయి. డీసెంట్ లుక్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను నాగ శౌర్య(Naga Shaurya) బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి(Lakshmi raave maa intiki), జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే ఒక మనసు లాంటి సినిమాలు చేశాడు.

there-are-many-movies-in-naga-shaurya-list
there are many movies in naga shaurya list

అయితే ఈ సినిమాలన్నీ నాగ శౌర్య(Naga Shaurya)కి కమర్షియల్ హీరో ఇమేజ్‌ను తీసుకు రాలేకపోయాయి. చేసిన కథలన్ని చాలా డీసెంట్‌గా ఉండటంతో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాలను ఆదరించారు. దాంతో ఆయన స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోలేపోయాడు. వీటిలో గట్టిగా ఓ రెండు సినిమాలైనా పక్కా కమర్షియల్ సినిమాలు గనక అయి ఉంటే టాలీవుడ్‌లో శౌర్యకి ఎప్పుడో కమర్షియల్ హీరో అని పేరు దక్కేది. ఇండస్ట్రీలో అందరూ తాపత్రయపడేది కమర్షియల్ హీరో అనిపించుకోవడానికే. శౌర్య కూడా అదే ట్రై చేశాడు.

Naga Shaurya: శౌర్య కమర్షియల్ సినిమాలకు పనికిరాడని కామెంట్స్ వచ్చాయి.

ఈ క్రమంలోనే ఛలో అనే సినిమాను సొంత బ్యానర్‌లో చేశాడు. ఈ సినిమా నాగ శౌర్య(Naga Shaurya)కి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది. సొంత బ్యానర్‌లో సాలీడ్ హిట్ అందుకున్న నాగ శౌర్య(Naga Shaurya)..వరుసగా సినిమాలను ప్రకటించాడు. ఈ సినిమా తర్వాత అమ్మమ్మ గారిల్లు అనే సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా సొంత బ్యానర్‌లో @నర్తనశాల అనే పక్కా కమర్షియల్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో శౌర్య కమర్షియల్ సినిమాలకు పనికిరాడని కామెంట్స్ వచ్చాయి.

అలాంటి కామెంట్స్ సాధారణంగా వరుస ఫ్లాప్స్ వచ్చే ఏ హీరోకైనా వచ్చేవే. నాగ శౌర్య(Naga Shaurya) కూడా అదే భావించాడు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలతో పాటు రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రకటిస్తూ వచ్చాడు. సొంత బ్యానర్‌లో చేసిన అశ్వద్ధామ మంచి కమర్షియల్ హిట్ అవుతుందనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఆయనకి గట్టి షాకిచ్చింది. అయినా శౌర్య ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేయనన్ని సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే లేడీ డైరెక్టర్ రూపొందించిన వరుడు కావలెను అనే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పూర్తి చేశాడు.

Naga Shaurya: నాగ శౌర్యకి కమర్షియల్ హీరో క్రేజ్ ఏవీ తెస్తాయో చూడాలి.

రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే విలువిద్య నేపథ్యంలో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్. ఇదే క్రమంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్ని సెట్స్ మీద ఉన్నాయి. వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. వాస్తవంగా ఈ సినిమాలన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వేవ్స్ వల్ల ఆగిపోయాయి. మరి వీటిలో ఎన్ని సూపర్ హిట్ అవుతాయో..నాగ శౌర్య(Naga Shaurya)కి కమర్షియల్ హీరో క్రేజ్ ఏవీ తెస్తాయో చూడాలి.

Related posts

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?