NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ సీజన్ 4 ప్లాన్స్ ఇవే ..!

తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమగా క్రేజ్ ఉన్న బిగ్‌బాస్ తెలుగు‌ సీజన్‌ 4 ఎప్పుడు మొదలవుతుందన్న ఆసక్తి అందరిలోను నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజన్ 4 కి సంబంధించి రకరకాలు వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. హోస్ట్ విషయం దగ్గర్నుంచి కంటెస్టెంట్స్ వరకు చాలా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు‌ సీజన్‌ 4 ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయట. ఇందులో భాగంగా.. బిగ్‌బాస్‌ ఇంటిని సిద్దం చేసేందుకు పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గత రెండు సీజన్‌లలో మాదిరిగానే ఈ సారి కూడా సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మించనున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో షోను ఈసారి ఎలా ప్లాన్‌ చేయాలన్న విషయంలో నిర్వాహకులు చర్చలు జరుపున్నట్టు సమాచారం.

 

 

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌లు అంతా ఒకే ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు కంటెస్టెంట్‌లు ఫిజికల్‌ టాస్క్‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక బిగ్‌బాస్‌ కోసం సినిమా మాదిరిగానే 250 మందికి పైగా యూనిట్ సభ్యులు పనిచేయాల్సిఉంటుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది నిర్వహకులు పెద్ద సవాలే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిజికల్‌ టాస్క్‌లు లేకుండా.. షోను డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఇక బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ అక్కినేని నాగార్జున.. సీజన్‌ 4 కి కూడా హోస్ట్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సోషల్ మీడియాలో సమంత, విజయ్ దేవరకొండ అంటూ ఈ సీజన్ విషయంలో హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని సమాచారం. మరోవైపు ఈ షో కంటెస్టెంట్‌ల ఎంపిక కూడా దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షో ఎప్పుడు ప్రారంభం కానుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella