పవన్ కోసం సురేందర్ రెడ్డి సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇదే .. 10 గబ్బర్ సింగ్ లకి సరిపడా హిట్ రాబోతోంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయో సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ గురించి అందరికీ తెల్సిందే. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ కొన్ని మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. త్వరలో ఆ బ్యాలెన్స్ టాకీ పార్ట్ ని కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నాడు.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

అలాగే క్రిష్ దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో ఒక సినిమా నిర్మిస్తుండా క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ తో కూడా ఒక సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ .. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తయారవనుంది. అయితే ఎటొచ్చి ఇప్పటి వరకు క్లారిటీ లేనిది సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయో సినిమా విషయంలోనే.

Producer Sri Ram Talluri And Director Surender Reddy Birthday Wishes To  Power Star Pawan Kalyan - IndustryHit.Com

సూరి ఎలాంటి కథ లో .. ఏ రకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ చూపించబోతున్నాడన్నది ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఏ జోనర్ లో రూపొందనుందో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగుతుందని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో పవన్ స్టామినకు తగ్గట్లు కథ సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది. అంతే కాదు సూరి గతంలో రవితేజ తో తీసిన కిక్ సినిమా తరహాలో సోషల్ మెస్సేజ్ కూడా ఉంటుందమొ సమాచారం.

ఇక తాజాగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీటవబోతుందని అధికారక ప్రకటన వచ్చింది. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ నటించబోతున్న సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమా కి త్రివిక్రం దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.