Transgenders అంటే ఏదో వింతగా చూసే ఈ కాలంలో ట్రాన్స్‌జెండర్ పెళ్లి చేసుకోవడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఈ విధంగా ఒక “గే” ను పెళ్లి చేసుకున్నవారు ఎంతో మందికి ఆదర్శం అవుతారు. ఆ విధంగా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న హాలీవుడ్ నటులు, దంపతులు అయినా ఎమ్మా పోర్ట్నర్, ఇలియట్ పేజ్ విడాకులు తీసుకోబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. వీరి మూడు సంవత్సరాల వివాహబంధానికి ముగింపు చెబుతున్నట్లు ఈ దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగానే విడాకుల కోసం మ్యాన్‌హట్టన్ కోర్టులో దరఖాస్తు చేశామని తెలిపారు.ఈ సందర్భంగా పేజ్ మాట్లాడుతూ..
మా వివాహ బంధం విషయంలో ఎంతో దీర్ఘంగా ఆలోచించిన తర్వాత విడిపోవడం వంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా పేజ్ తెలిపారు. మేమిద్దరం విడాకులు తీసుకున్నప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతుందని, పరస్పరం ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటామని వీరు తెలిపారు.దాదాపు ఒక సంవత్సరం పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట 2018 లో వివాహం చేసుకొని ఎవరికీ తెలియని ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం వీరి వివాహ బంధం గురించి తెలియజేస్తూ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇకపోతే ఫేజ్ 2014లో తన ఒక గే అని ప్రకటించారు. తాజాగా పేజ్ తనను తాను ట్రాన్స్ మ్యాన్ గా అంగీకరించారు. ఈ విషయంలో అతను ఒక గే అని తెలిసిన తనకు ఎంతో మంది మద్దతు తెలియజేయడంతో వారందరికీ పేజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫేజ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా “నా ఈ ప్రయాణంలో నేను ఎవరు అనేది గుర్తించాను. నా జీవితంలో నాకు మద్దతుగా నిలబడిన ఎంతో మంది వ్యక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నేను గొప్పగా ప్రేమించుకుంటున్నాను, నా పట్ల నాకున్న ప్రేమ ఎంత గొప్పదో మాటలలో చెప్పలేను” అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ సమయంలో ఎమ్మా పోర్టనర్ పేజ్‌కి మద్దతు తెలిపారు. దీనిపై స్పందించిన ఏమ్మా.. ”పేజ్ లాంటి వ్యక్తులు దేవుడిచ్చిన బహుమతి.. వారిని గౌరవించాలి.. వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదు” అంటూ సపోర్ట్ చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!