Siddharth: సిద్ధార్థ్.. ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న నటుడు. 2003లో బాయ్స్ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్.. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ చేశారు. ఈ మూవీ తర్వాత సిద్ధార్థ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అనతి కాలంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అలాగే అనేక చిత్రాల్లో సాంగ్స్ పాడి సింగర్ గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గత దశాబ్దం నుంచి సరైన హిట్లు లేకపోవడం వల్ల సిద్ధార్థ్ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడంటూ నిన్నటి నుంచి మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధర్థ్ దాదాపు మూడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్నాడు.
లవ్‌లో ఉన్నామని నేరుగా చెప్పకపోయినా.. జంటగా పార్టీలకు, వెకేషన్లకు వెళ్తూ పరోక్షంగా తమ రిలేషన్ పై హిట్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఫైనల్ గా సిద్ధార్థ్-అదితి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం వేద మంత్రాల సాక్షిగా అదితి మెడలో సిద్ధార్థ్ మూడు ముళ్లు వేశాడు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ పెళ్లి తంతు కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు.
సిద్ధార్థ్-అదితి తమ పెళ్లిని ఇంకా అధికారికంగా ధృవీకరించకపోవడం గమనార్హం. ఇకపోతే సిద్ధార్థ్ మొదట తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని మొదటి భార్య పేరు మేఘన. ఢిల్లీలో సిద్ధార్థ్ ఇంటి పక్కనే మేఘన కూడా ఉండేది. 2003లో పెద్దల అంగీకారంతో సిద్ధార్థ్, మేఘన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు.
పెళ్లి తర్వాత సిద్ధార్థ్, మేఘన దంపతుల సంసారం కొంత కాలం బాగానే సాగినా.. ఆ తర్వాత మనస్పర్థలు ప్రారంభం అయ్యాయి. అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా ఉండే సిద్ధార్థ్.. వివాహం అనంతరం బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఇది కాస్త మేఘనకు తెలిసిపోవడంతో సిద్ధార్థ్‌తో ఆమెకు గొడవలు ప్రారంభం అయ్యాయి. అవి పెరిగి పెరిగి విడాకుల వరకు వెళ్లాయి. 2007లో అధికారికంగా సిద్ధార్థ్, మేఘన డివోర్స్ తీసుకున్నారు. ఆపై సమంతతో సహా చాలా మంది హీరోయిన్లతో రిలేషన్ మెయింటైన్ చేసిన సిద్ధర్థ్.. ఇప్పుడు అదితితో మరోసారి కపుల్ లైఫ్‌ను స్టార్ట్ చేశాడు. ఇక సిద్ధర్థ్-అదితి మధ్య ఏజ్ గ్యాప్ ఏంతో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే అదితి కంటే సిద్ధార్థ్ దాదాపు 7 సంవత్సరాలు పెద్దవాడు. అదితి వయసు 37 కాగా.. సిద్ధార్థ్‌కు 44 ఏళ్లు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!