Heeramandi OTT Release: బాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరైన సంజయ్ లీల బన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన తాజాగా డైరెక్ట్ చేసిన సిరీస్ ” హిరామండి ది డైమండ్ బజార్ “. ఇక ఈయన ఈ సిరీస్ ను ప్రత్యేకంగా తీసుకుని రూపొందించారు. కొన్ని గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించిన భన్సాలీ.. ఈ సిరీస్ తో ఓటిటి ఫ్లాట్ ఫారం కి కూడా ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం ఈ సిరీస్ యొక్క షూటింగ్ మొదలైంది. అయినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సిరీస్ యొక్క రిలీజ్ డేట్ కూడా వెనకబడింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేసుకున్నాయి. హిరామండి వెబ్ సిరీస్ ఈ ఏడాది మే 1వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తుంది.
చాలా కాలం సందిగ్ధత అనంతరం ఎట్టకేలకు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మే 1 నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. హిరామండి సిరీస్లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి , రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక ఈ సిరీస్ నుంచి ఫిబ్రవరిలో ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరిని బీభత్సంగా ఆకట్టుకుంది. ఇక దీంతో ఈ సిరీస్ పై భారీ హైప్స్ సైతం నెలకొన్నాయి. దీంతో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎందరో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలోనే అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు ఈ సిరీస్ మేకర్స్. అలా మే 1వ తేదీన ప్రకటించారు. భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్న 1940ల కారం బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ రూపొందాయి. హీరమండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవనం సాగించే డాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్ లో దర్శకుడు భన్సాలీ స్పష్టంగా చూపించాడు. బ్రిటిష్ పాలనలో దారుణాలను ఎదుర్కొన్న ఆ మహిళల గురించి ఎంతో గర్వంగా రూపొందించారు. అదేవిధంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమ సమయం నాటి కథ ఇది.
హిరామండి వెబ్ సిరీస్ కు సంజీయ్ లీల పాటు మితాక్షర కుమార్,విభు తదితరులు కూడా ఈ కథను అందించారు. ఇక ఈ సిరీస్ కు సంగీతం సైతం డైరెక్టర్ సంజయ్ లీలనే అందించారు. భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ లీల తో పాటు ప్రేరణ సింగ్ ఈ సిరీస్ ను నిర్మించారు. ఇక 2022లోనే హిరామండి వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. 2023 ఆరంభంలో ఈ సిరీస్ గురించి సంజయ్ లీల అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతానికి అయితే భారీ హైప్స్ తో ఈ సిరీస్ ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ హైబ్స్ ను నిలబెట్టుకుంటాయో లేదో చూడాలి…!
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!