24.2 C
Hyderabad
February 1, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎల్‌జి‌బి‌టి స్వలింగ సంపర్కులు UPSC పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి కాగలరా?

LGBT in UPSC
Share

UPSC: ఎల్‌జి‌బి‌టి స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్కులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే UPSC పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి అంటే జిల్లా కలెక్టర్ లాంటి అధికారి కాగలడా?

ఇటీవల డా. ప్రాచీ రాథోడ్ తెలంగాణ రాష్ట్రం లో మొదటి ఎల్‌జి‌బి‌టి (LGBT) ప్రభుత్వ డాక్టర్ గా బాధ్యతలు చేపట్టి వార్తల్లో సంచలనం సృష్టించారు. ఎల్‌జి‌బి‌టి అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్ మరియు లింగమార్పిడి కమ్యూనిటీకి చెందిన వారు. సెక్షన్ 377 పై సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ఇండియా లో చాలా మంది ఎల్‌జి‌బి‌టి కమ్యూనిటీకి చెందిన వారు తమ లైంగికత గురించి బహిర్గంగా మాట్లాడుతూ సమాజం లో తమకున్న హక్కుల గురించి వారి పట్ల ఉండే పక్షపాతం కి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది. బహిర్గంగా తమ లైంగికత తెలియజేసిన ఎల్‌జి‌బి‌టి కి చెందిన స్వలింగ సంపర్కులు UPSC పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి కావొచ్చా? ఈ కోవకి చెందిన వారు పక్షపాతం ఎదుర్కోకుండా ప్రశాంతంగా పని చేసే వాతావరణం మన ఇండియన్ బ్యూరోక్రసీ లో ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

రైట్ టు ప్రైవసీ: గోప్యతా హక్కు

ఒక వ్యక్తి లైంగికత అనేది వ్యక్తిగత విషయం, మన రాజ్యాంగంలో రైట్ టు ప్రైవసీ అంటే గోప్యతా హక్కు కింద ప్రాథమిక హక్కు గా దీనిని భావించాలి. తమ లైంగికత గురించి బయటపెట్టకుండా ఇప్పటికే చాలా మంది ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో పని చేస్తున్నారు. కానీ చాలా మంది ఇలా వారి లైంగికతను బహిర్గతం చేయకుండా గోప్యాంగానే తమ పని చేసుకుంటన్నారు. అంటే అడగవద్దు, చెప్పవద్దు, విధానం అన్నమాట.

ఎల్‌జి‌బి‌టి కమ్యూనిటీకి వ్యతిరేకంగా UPSC పరీక్ష లో ఎలాంటి నిబంధనలు లేవు. వీరు ఈ పరీక్ష రాసి ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో చేరవొచ్చు, కానీ మన సమాజం లో ఉన్న పక్షపాతం వీరి పట్ల ఉండే చిన్న చూపు చాలా మందిని ఇలాంటి పరీక్షలు రాయకుండా నిస్పృహకు గురి చేస్తుంది.

సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లో

ఎల్‌జి‌బి‌టి కమ్యూనిటీకి చెందిన వారు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లో వారి లైంగికత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వేళ చెప్పాలి అనుకుంటే ధైర్యంగా చెప్పొచ్చు. కాని అల చెప్పిన తరువాత ఇంటర్వ్యూ లో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టె కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకి, ఒక ఓపెన్ జగే వ్యక్తిగా మీకు ఆచరణాత్మక అంశాలలో సమస్యలు తలెత్తుతాయి అవి ఎలా ఎదుర్కుంటారు అని అడగొచ్చు. అప్పుడు సరైన సమాధానం ఇవ్వ గలిగితే చాలు. ఈ ప్రశ్న ఒక అంధుడిని కూడా అడగవోచు, అది అడగడం కూడా సబబు, ఎందుకంటే జిల్లా కు సంబందించిన అధికారిక బాధ్యతలు మీకు ఉంటాయి, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటు మీ విధులు నిర్వహించడంలో విఫలం అవ్వకుండా ముందుకు వెళ్లే సామర్ధ్యం, ధైర్యం,నమ్మకం మీకు ఉందా అని ఆరా తీయటం ఇంటర్వ్యూ చేసే వారి బాధ్యత.

మొత్తానికి చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఎల్‌జి‌బి‌టి (LGBT) కమ్యూనిటీకి చెందిన వారు నిస్సందేహంగా UPSC పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి కావాలనే వారి కళను నిరవేర్చుకోవొచ్చు. దానికి వ్యతిరేకంగా చట్టంలో కానీ UPSC నిబంధనల్లో కానీ ఎక్కడా లేదు. కానీ మామూలుగానే క్లియర్ చేయడం కష్టమైన UPSC సివిల్స్ పరీక్షా, అది క్లియర్ చేసిన తరువాత ఇంకా కష్టమయ్యే పరిస్థిథి ఇంకా ఈ దేశంలో పోలేదు. ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి అవ్వాలని వీరు ఎంచుకున్న బాట ఒక ముళ్ల బాట UPSC పరీక్షతో ఆగిపోదు, క్లియర్ చేసిన తరువాత కూడా జీవితాంతం చేయాల్సిన పోరాటం అనే చెప్పాలి.

 


Share

Related posts

హస్తినలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్

somaraju sharma

Eatela Rajendar: ఈట‌ల ఎపిసోడ్‌తో ఇరుకున ప‌డిపోయిన ర‌ఘురామరాజు

sridhar

Wife: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఎందుకు గృహనిర్మాణం చేయకూడదు???

Naina