NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Women Police Crimes: మహానగరంలో మాయ”లేడి” కానిస్టేబుల్..! మూడేళ్ళలో నాలుగు పెళ్లిళ్లు – ఆపై మోసం..!!

Women Police Crimes: Cheating with many marriages

Women Police Crimes:  అదొక మహా నగరం.. ఎంతో మంది మాయలోళ్లు.. కిలాడీలు.., అల్లరోళ్ళు.., చిల్లర మూకలు ఉంటారు.. వారిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టడానికి పోలీసు శాఖ ఉంటుంది..! కానీ పోలీసు శాఖలోనే ఓ మాయలేడి తయారయింది. పోలీసు ఉద్యోగాన్ని తన హానీ ట్రాప్ పనులకు వాడుకుంది. “మీరు కాస్త డబ్బున్న కుర్రోళ్లయితే మీకు ఫోన్ చేస్తుంది. మాట కలుపుతుంది. పెళ్ళికి రెడీ అంటుంది. డబ్బు తన చేతికి వెళ్ళాక.. విడాకులు అంటుంది..” ఇలా ఏకంగా ముగ్గుర్ని వలలో వేసేసుకుని.. ఈరోజే పోలీసులకు చిక్కింది. బాగా డబ్బున్న ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుని వాళ్లకు తెలియకుండానే మోసం చేసి డబ్బుతో చెక్కేసింది..! హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..!

Women Police Crimes: Cheating with many marriages
Women Police Crimes Cheating with many marriages

Women Police Crimes:  ఏఆర్ విభాగంలో డ్యూటీ..!!

హైదరాబాద్ లో ఎఆర్ మహిళ కానిస్టేబుల్.. నగరంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తుంది. పేరు సంధ్యారాణి. వయసు పాతిక ఉంటుంది. చూడడానికి అందంగానే ఉంటుంది. అందం ఉంది, మాంచి ఉద్యోగం ఉంది.. యువకులను వల వేయడానికి ఈ రెండు ఆయుధాలను బాగా వాడుకుంది. ఆమె నాలుగో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో డొంక మొత్తం కదిలింది. ఈమె కొన్ని రోజుల కిందట హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వచ్చిన చరణ్ తేజ అనే కుర్రాడిని ప్రేమించినట్టు వెంట పడింది. మాటలు కలిపి, పెళ్లి చేసుకోమని బెదిరించింది. లేకపోతే ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరించడంతో.. చేసేదేమి లేక చరణ్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమె చరిత్ర తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదులో సంచలన అంశాలు పేర్కొన్నాడు.

Women Police Crimes: Cheating with many marriages
Women Police Crimes Cheating with many marriages

గతంలోనే తల్లిదండులు కూడా ఫిర్యాదు..!!

“గడిచిన నాలుగేళ్ళలో ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ విడాకులు ఇచ్చేసింది. మరొకరు ఈ కానిస్టేబుల్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. నేను నాలుగో వాడిని. బాగా డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకోవడమే ఆమె పని. జల్సాలకు బాగా అలవాటు పడింది. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి. ఒంటరిగా ఉన్న కుర్రాళ్లకు ఫోన్ చేసి మాటలు కలిపి డబ్బులు కాజేస్తుంది. కానిస్టేబుల్ సంధ్య రాణి ట్రాప్ నుండి నన్ను రక్షించండి అంటూ శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్ లకు ఆన్లైన్ ద్వారా పిర్యాదు చేసిన బాధితుడు.. ఈ అంశంలో పెద్ద ట్విస్టు ఏమిటంటే… సంధ్యారాణి వరుస పెళ్లిళ్లపై గతంలోనే జూబ్లీహిల్స్స్టేషన్ లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి తల్లిదండ్రులను కూడా వదిలేసింది. పోలీస్ ఉద్యోగం అని భయపడకుండా ఇష్టమొచ్చిన వారితో తిరుగుతుంది అని తల్లితండ్రుల స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టి ఆమెను అరెస్టు చేసి బాధితులను రక్షించాలంటూ చరణ్ పేర్కొన్నారు. ఆమె బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నా ముందుకు రావాలని కోరాడు..!!

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju