NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పొత్తులు పెట్టుకోవ‌చ్చు.. కానీ ఇలా చేస్తావేంటి ప‌వ‌నూ…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతామ‌ని చెప్పిన జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆది శ‌గానే ముందుకు సాగుతున్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్ప‌ప‌ట్ట‌డం లేదు. ఇక‌, సీట్ల విష‌యంలోనూ 24 తీసుకు న్నారు. దీనిని కూడా ఆయ‌న స‌మ‌ర్థించుకున్నారు. అంతేకాదు.. త‌నను ఎవ‌రూ ప్ర‌శ్నించేందుకు వీల్లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో నోరు తెరిచిన నాయ‌కులు కూడా మౌనంగా ఉండిపో యారు. 24 అసెంబ్లీ స్థానాలకే ప‌రిమితం అయ్యారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇది త‌న ఇష్టం.. త‌న పార్టీ నిర్ణ‌యాత్మ‌క విధానం కూడా కావొచ్చు. అయితే.. ఆ త‌ర్వాత స్టెప్‌లో మాత్ర‌మే ప్ర‌శ్న‌లు సంధించేలా ప‌రిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి ప‌ని చేసిన వారిని.. పార్టీ కాడి మోసిన వారిని ప‌క్క‌న పెట్ట‌డం తీవ్ర వివాదంగా మారుతోంది. జ‌న‌సేన‌కు కేటాయిం చిన సీట్ల‌లో కూడా.. లోపాయికారీగా టీడీపీ నేత‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఇక్క‌డ ఎలా ఉంటుందంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ద‌రు నేత‌లు టీడీపీలోనే ఉంటారు.

కానీ, త‌మ‌కు టికెట్‌లు ద‌క్క‌లేద‌న్న అసంతృప్తితో ఆ నాయ‌కులు.. టీడీపీకి రాజీనామా చేస్తారు. ఆ వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చి.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటారు. వెంట‌నేవారికి టికెట్ ఇస్తారు. ఇదొక రాజ‌కీయం.. ఇప్పుడు జ‌న‌సేన‌లో చ‌ర్చ‌గా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు ధ‌ర్మ‌వ‌రం టికెట్ ఉంది. ఇక్క‌డ టీడీపీ నుంచి ప‌రిటాల శ్రీరాం పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. కానీ, టీడీపీకి బీజేపీలో ఉన్న వ‌ర‌దా పురం సూరిని తీసుకువ‌చ్చి.. నిల‌బెట్టాల‌ని ఉంది. దీనికి ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఇక్క‌డ రాజ‌కీయాలు యూటర్న్ తీసుకున్నాయి. సూరి..త్వ‌ర‌లోనే బీజేపీకి రాజీనామా చేసి.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటార‌ట‌. ఆవెంట‌నే ఆయ‌న‌కు జ‌న‌సేన టికెట్ ఇచ్చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిన్న మొన్న‌టివ‌ర‌కు పార్టీ జెండాలు మోసి.. ప‌వ‌న్‌కు జై కొట్టిన నాయ‌కులు ఏం కావాల‌నేది ప్ర‌శ్న‌.

దీనినే క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సైనికులు ప‌రిశీలిస్తున్నారు. ఈ ప‌రిస్థితి క‌నీసం 4 -6 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంటుంద‌ని అంటున్నారు. ఇలాగే క‌నుక వ్య‌వ‌హ‌రిస్తే.. జ‌న‌సేన‌లోనే పెద్ద ఇబ్బందికర వాతావ‌ర‌ణం ఎదురయ్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju