విశాఖ, ఏప్రిల్ 1: ‘నా పేరు వివి లక్ష్మీనారాయణ, ఈవిఎంలో సీరియల్ నెం.7లో గాజు గ్లాస్ గుర్తుకు ఎదురుగా ఉంటుంది’ అంటూ విశాఖ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ ఓటర్లకు వివరంగా చెబుతున్నారు. ఆయన సిబిఐ అధికారిగా పదవీ విరమణ చేసినా అందరూ జెడి లక్ష్మీనారాయణ గానే సంభోదిస్తుండటంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా ఓటర్లకు తన ఇంటి పేరు జెడి కాదని వివి అని తెలియజేస్తున్నారు.
సిబిఐ జాయింట్ డెరెక్టర్ (జెడి)గా రాష్టంలో పని చేసి ఉండటం వల్ల ఆయన్ను చాలా మంది ఇప్పటికీ జెడి లక్ష్మీనారాయణగానే భావిస్తున్నారు. జెడి అనే పదం తన కొంపముంచుతుందేమోనని ఆయన ఇవిఎంలో తన పేరు ఈ విధంగా ఉంటుందని వివరిస్తున్నారు.