న్యూస్ రాజ‌కీయాలు

Stalin: గవర్నర్ అధికారాలకు స్టాలిన్ సర్కార్ కత్తెర! ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానుసారమే యూనివర్శిటీ వీసీల నియామకం!

Share

Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ల ను నియమించే గవర్నర్ అధికారాన్ని ఆయన ప్రభుత్వం కత్తిరించింది.ఇకపై తమిళనాడులోని పదమూడు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించే విధంగా శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి స్టాలిన్ సర్కార్ ఆమోదింపజేసుకుంది.వూటీలో వైస్ ఛాన్సలర్ల సమావేశం గవర్నర్ రవి అధ్యక్షతన జరగనున్న సమయంలోనే స్టాలిన్ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

Stalin: అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్!

స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ను శాసనసభలో అటు అన్నాడీఎంకే, ఇటు బీజేపీ కూడా వ్యతిరేకించాయి.బీజేపీ ఇంకాస్త ముందుకెళ్లి సభనుండి వాకౌట్ చేసింది.గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదని వాదించింది. అయినా అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ఈ విషయంలో తన వాదనను గట్టిగా సమర్థించుకున్నారు.

ఎందుకిలా చేస్తున్నామంటే!

వైస్ ఛాన్సలర్ల నియామకం ఇటీవలి కాలంలో ఏకపక్షంగా సాగుతోందని,ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్న రీతిలో కొందరు గవర్నర్లు వ్యవహరిస్తున్నారని స్టాలిన్ సభాముఖంగా ప్రకటించారు.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ల ను అధికారం కలిగి లేకపోవటం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు.అంతేగాక కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి నియమించిన పునిచ్చి కమీషన్ కూడా వైస్ ఛాన్సలర్ల ను నియమించే అధికారం గవర్నర్లకు ఉండకూడదని సిఫార్సు చేసిందని ఆయన వివరించారు.దేశంలో పందొమ్మిది రాష్ట్రాలు ఈ సిఫార్సుకు సుముఖత వ్యక్తం చేశాయని ఆయన చెప్పారు.గతంలో పళని స్వామి నాయకత్వం లోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా ఈ సిఫార్సును స్వాగతించిందని ఎంకే స్టాలిన్ వెల్లడించారు.వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో వివాదాలు తలెత్తకుండా చూడడానికే అధికారాన్ని తన ప్రభుత్వం తీసుకుంటోందని ముఖ్యమంత్రి వివరించారు.స్టాలిన్ చర్యపై ఇతర రాష్ట్రాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి


Share

Related posts

సీఎం జగన్ మాట తప్పరా?

Mahesh

Health: లంగ్స్ హెల్దీగా ఉండాలంటే ఈ చిన్న వ్యాయామం చేస్తే చాలు..!!

bharani jella

Traffic Police : ఈ సీతయ్య ఎవరి మాట వినడు…!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar