NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కొల్లు రవీంద్ర అరెస్టుపై ఆసక్తికర విషయాలు.. !!

మాజీ మంత్రి కొల్లు రవీంద్రని కృష్ణా జిల్లా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బందరు లోని వైసీపి నాయకుడు మేకా భాస్కర్ రావు హత్య కేసులో రవీంద్రను కూడా నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కొల్లు రవీంద్ర రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ బలమైన ఆరోపణలు బయటికి తీసుకు వస్తోంది. పోలీసులను సూటిగా ప్రశ్నిస్తుంది. దీనిపై న్యాయనిపుణులతో చర్చించి పోలీసులను, ప్రభుత్వాన్ని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నేత కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఈ రోజు కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ ప్రకారం కొల్లు రవీంద్ర కేసు విషయంలో టిడిపి ఎంత పట్టుదలతో ఉందో అర్థమవుతోంది.

పోలీసులు దొరికినట్లేనా..?

29వ తేదీ ఉదయం భాస్కరరావు హత్య జరిగే సమయానికి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారని, వారితో మీటింగ్ విషయమై మాట్లాడారని టిడిపి ఆధారాలను బయటపెట్టింది. కానీ ఆ సమయంలో నిందితులతో కొల్లు రవీంద్ర మాట్లాడారని పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొనడాన్ని టిడిపి తప్పుపట్టింది. తాము ఆధారాలు చూపిస్తున్నా మనీ, పోలీసులు కూడా నిందితులతో మాట్లాడుతున్నట్టు ఆధారాలు చూపించాలని కోరింది. ఇదే సమయంలో జూన్ 29 రాత్రే భాస్కర్ రావు హత్య కేసులో కొంత మంది ప్రధాన నిందితుడు స్టేషన్ కు వచ్చి లోంగి పోయారని, ఆ తర్వాత రోజు సాక్షి పత్రిక లో కూడా లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయనీ కానీ జూలై రెండవ తేదీన వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఎలా చెబుతారనీ, ఈ మధ్యలో రెండు రోజుల్లో ఏం జరిగింది అని పోలీసు లను పట్టాభిరామ్ ప్రశ్న వేశారు. ఇలా కొల్లు రవీంద్ర కేసులో తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన ఆధారాలు కృష్ణాజిల్లా పోలీసులకు ఇప్పుడు చెమటలు పట్టిస్తున్నాయి. హత్య జరిగిన సమయానికి ఆయన కలెక్టర్ ఆఫీస్, ఎస్ పీఆఫీస్ లో ఉండటం నిజమే అయితే పోలీసులు నిందితులతో మాట్లాడుతున్నట్టు ఎలా రుజువు చేయగలరు. అలాగే జూన్ 29వ తేదీనే నిందితులు లొంగిపోయిన లను మాట వాస్తవం అయితే జూలై 2వ తేదీన అరెస్టు చేసినట్టు ఎందుకు చూపించారు. అలాగే ఎఫ్ఐఆర్ లో ఏ 3, ఏ 5 పేర్లు లేకుండా ఖాళీగా ఉంచిన పోలీసులు..చార్జిషీట్ లో మాత్రం ఏ 3, ఏ 5 లను అరెస్టు చేశామని ఎలా చూపించారు? పేరు నమోదు చేయకుండా చార్జిషీట్ లో అరెస్ట్ చేసినట్లు చూపిస్తే చెల్లుతుందా? ఇలా కొత్త అనుమానాలు తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది. వీటిపై పోలీసుల సరైన సమాధానం చెప్పకోకపోతే కోర్టు ముందు దోషులుగా నిలబడవలసిన వస్తుంది.

సాధ్యమైనంతగా పోరాడే దిశగా టిడిపి

అచ్చెన్నాయుడు కేసు విషయంలో పది రోజుల పాటు బలంగా పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ..కొల్లు రవీంద్ర కేసు విషయంలో కూడా అదే స్థాయిలో పోరాటం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దర్నీ బయటకు తీసుకువచ్చి తమ పట్టు నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ కోర్టులనే నమ్ముకుంది. అందుకే తగిన ఆధారాలు సేకరిస్తూ, బలమైన న్యాయవాదులను నియమించుకుని కోర్టు ముందు వాదించే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు, కృష్ణాజిల్లాలో కొల్లు రవీంద్ర బలమైన నాయకులుగా ఉన్నారు. వారితో పాటు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు వంటి నాయకులపై కూడా కేసులు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం పోలీసులు పెట్టిన కేసుల నుంచి బయటపడటమే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద పనిగా మారింది. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, కుమారుడు, అతని పీఎస్ పై కూడా ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలు రావడం, వారినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం తో తెలుగుదేశం పార్టీ మరింత అప్రమత్తమైంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?