పధకం ప్రకారమే జగన్‌పై దాడి

 

విశాఖపట్నం జనవరి2: పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడని విశాఖ నగర సీపీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.  పబ్లిసీటి కోసమే జగన్‌పై నిందితుడు శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడని అన్నారు. అక్టోబర్ 18నే జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాస్ ప్రణాళిక వేశాడన్నారు. అక్టోబర్ 17నే జగన్ వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.

కోడికత్తి సానపెట్టేటప్పుడు సహచరులు చూశామని చెప్పారన్నారు. ఈ రోజు నన్ను టీవీలో చూస్తారని శ్రీనివాస్ అన్నట్లు  సహోద్యోగి అమ్మాజీ పోలీసులకు చెప్పిందని ఆయన తెలిపారు. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేశాడని తెలిపారు. వైసీపీ నాయకుడు ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతుండంగా  నిందితుడు దాడి చేశాడన్నారు. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.  తాము చెప్పేదాకా చార్జిషీట్ దాఖలు చేయొద్దని హైకోర్టు ఆదేశించిందని సీపీ పేర్కొన్నారు.