NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MlAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఆడియోలు లీక్ చేసిన టీఆర్ఎస్ .. బీజేపీ నీచ రాజకీయ బాగోతాలకు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ..

TRS MlAs Buying Case:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నీచరాజకీయాలకు తెర లేపింది అంటూ టీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ఇది అంతా టీఆర్ఎస్, కేసిఆర్ ఆడుతున్న డ్రామాగా బీజేపీ ప్రత్యారోపణలు చేస్తొంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిరస్కరించడంతో వారు విడుదల అయ్యారు. దీనిపై సైబరాబాద్ పోలీసులు మెజిస్ట్రేట్ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై సాయంత్రం 4 గంటలకు విచారణ జరగనుంది. ఈ కేసును ప్రత్యేక దర్యప్తు సంస్థ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

 

ఈ బేరసారాల విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పేర్కొనడంతో పాటు టీఆర్ఎస్ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపమలు చేశారు. యాద్రాద్రి గుడిలో ప్రమాణం చేయాలంటూ సవాల్ చేసిన బండి సంజయ్ ఈ రోజు ఆలయానికి చేరుకుని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన దానికి తనకు సంబంధం లేదంటూ ప్రమాణం చేశారు. కొనుగోళ్ల వ్యవహారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీఎం కేసిఆర్ మీడియా ముందుకు వస్తారని ప్రచారం జరిగినా శుక్రవారం సాయంత్రం వరకూ రాలేదు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఘటన జరిగిన రాత్రి నుండి ప్రగతి భవన్ లోనే ఉన్నారు. మరో పక్క ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామంచంద్ర భారతి స్వామిజీ, నందకుమార్ లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సంభాషణవి జరిపినట్లుగా ఉన్న ఆడియోలు లీక్ కావడం కలకలాన్ని రేపింది.

 

ఈ ఆడియోలను టీఆర్ఎస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. “ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడ్డ బీజేపీ బేరసారాల బాగోతం..ఇది కేవలం ట్రైలర్ మాత్రమే… ముందు ముందు మరింత బయటకి రానున్న బీజేపీ నీచ రాజకీయాల బాగోతం” అంటూ రెండు ఆడియోలను పోస్టు చేసింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో లు వైరల్ గా మారాయి. మరో పక్క సాయంత్రం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ సదరు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకు ముందు ఈ కేసు విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందు మాట్లాడవద్దంటూ మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. దీనిపై కేసిఆర్ ఏ విధంగా బీజేపీకి కౌంటర్ ఇస్తారు అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కల్గిస్తొంది.

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక మలుపు.. మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేసిన పోలీసుల

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju