NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ నేతలకు జగనే ఎనర్జీ టానిక్ ఇవ్వాలి !

అధికారంలోకి రాక ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొందరు నేతలను బుజ్జగించేందుకు శాసనమండలి తాయిలం చూపారు.అదే ఇప్పుడు వైసీపీలో కొంత అశాంతికి కారణమవుతోంది.

 

ఏపీలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కొందరు సీనియర్ వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దేనికి సంకేతమని విశ్లేషిస్తే ఉన్న శాసనమండలిని రద్దు చేయడాన్ని అనేక మంది సీనియర్ నేతలు ఆంతరింగక సంభాషణల్లో తప్పుపడుతున్నారు. దాడి వీరభద్రరావు, సి.రామచంద్రయ్య, మర్రి రాజశేఖర్, కిల్లికృపారాణి వంటి నేతలు ఎమ్మెల్సీ పోస్టులను ఆశిస్తున్నారు.కానీ జగన్ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపారు.వైసీపీ అధికారంలోకి రాగానే తమకు మంచి పదవులు వస్తాయని ఆ సీనియర్ నేతలు ఆశించారు. ఎన్నికలకు ముందు తాము పడ్డ కష్టాన్ని జగన్ గుర్తిస్తారనుకున్నారు.

అయితే శాసనమండలి రద్దు యోచనతో వారికి ఫ్యూచర్ కనిపించటంలేదు.. దీంతో గత కొన్నాళ్లుగా సీనియర్ నేతలు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ప్రతి పథకంలో తెలుగుదేశం పార్టీ అవినీతి ఉందని ఎలుగెత్తి చాటుతున్నప్పటికీ వారు మాత్రం నోరుమొదపడం లేదు. వైసీపీలో కొద్ది మంది మాత్రమే విపక్షాల విమర్శలను ఖండిస్తున్నారు.

ఇలా జగన్ తాను మాట ఇచ్చిన వారికి భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం లేదన్న స్పష్టత రావడంతో వారి గొంతులు మూగబోయాయన్న టాక్ వైసీపీలో బలంగా విన్పిస్తుంది.తమకు పార్టీలో భవిష్యత్ ఉందనుకుంటేనే నేతలు పార్టీలో యాక్టివ్గా ఉంటారు ఉంటారు. లేకుంటే మొహం చాటేస్తారు.

వైసీపీలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది.ఇది కొద్దిగా పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ప్రతిపక్షాల దాడిని సమర్థంగా ఎదుర్కోగల కొందరు వైసిపి నేతలు మూగనోము పట్టడాన్ని అధినేత జగన్ గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం అని ఆ వర్గాలు చెబుతున్నాయి


author avatar
Yandamuri

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju