గతాన్ని మరిచిపోయి ఒక మనిషి కొన్నేళ్లు కోమాలో ఉండి మళ్ళీ తిరిగి రావడం అనే కాన్సెప్ట్ మూవీస్ చాలానే చూశాం. ఇక ఇలాంటి ఒక కాన్సెప్ట్ పై పూర్తి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘కోమాలి’. జయం రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళంలో గత సంవత్సరమే విడుదల అయింది. అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ నేరుగా జి5 లో డిజిటల్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…..
కథ
జయం రవి తన యుక్త వయసులో సంయుక్త హెగ్డే ను ప్రేమిస్తాడు. 1999లో తను ప్రేమించిన సంయుక్త తన ప్రేమ గురించి చెప్పేద్దాం అని అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అతను కోమా లోకి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత మళ్ళీ పదహారేళ్ల కి రవి స్పృహలోకి వస్తాడు. దాదాపు తన యవ్వన జీవితం మొత్తం కోమాలోనే గడిచిపోతుంది. అలా వచ్చిన రవి తర్వాత ఏం చేస్తాడు….? టెక్నాలజీ తో నిండిపోయిన ఈ లోకంలో అతనికి ఏమి కన్ఫ్యూజన్ ఉంటాయి? అతని జీవితంలో కాజల్ పాత్ర ఎలాంటిది? అతనికి ఉన్న బాధ్యతలు ఏమిటి? అతని లైఫ్ అక్కడి నుండి ఎలా టర్న్ అయ్యింది అన్నదే కథ.
ప్లస్ లు
జయం రవి పర్ఫార్మెన్స్
కామెడీ
సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ లు
పెద్దగా బలం లేని కథ
లాజిక్ లెస్ పాయింట్లు
ఊహించ దగ్గ కథాంశం
విశ్లేషణ
పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు కామెడీ కథాంశం కావడంతో ఎవరికీ పెద్దగా ఇబ్బందులు తలెత్తే లేదు కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఇక చాలా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. కామెడీనే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ యోగిబాబు కుమ్మేసాడు విలన్ రోల్ చేసిన కె.ఎస్.రవికుమార్ కూడా మెప్పించాడు అయితే స్క్రీన్ ప్లే కొద్దిగా ప్రెడిక్టబుల్ గా ఉండడం.. రెండు గంటలు నిడివి ఉండే సినిమాలో కథ పూర్తిగా చెప్పడానికి స్కోప్ లేకపోవడం కామెడీ సినిమాకి లాజిక్ లు ఎందుకన్నట్లు ఉన్న కథాంశం మైనస్ లు అనే చెప్పాలి కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా వచ్చేస్తూ కామెడీ కామెడీ మెసేజ్ కి మెసేజ్ అందించిన కోమాలి ఒక రెండు గంటలు మీవి కావనుకుంటే బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.
చివరి మాట : కోమాలి… కడుపుబ్బా నవ్వుకోవాలి