ఈ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను వినిపించగలిగాయి. ఇక కూలి నెంబర్ వన్ సినిమా కి వస్తే 1995లో గోవింద హీరో గా విడుదలైన కూలి నెంబర్ వన్ సినిమా కి ఇది రీమేక్. వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే…
కథ
గోవాలోని అత్యంతధనవంతుడు జెఫ్రీ రోజారియో (పరేష్ రావల్) తన కూతురు సారా అలీ ఖాన్ కు తనకన్నా అత్యంత ధనవంతుడైన వ్యక్తిని భర్తగా చూడాలని కోరుకుంటాడు. ఇదే అతని జీవిత ఆశయం కూడా. ఇక సంబంధాలు చూసి బ్రోకర్ జై కిషన్ ను జెఫ్రీ ఒకానొక సందర్భంలో అవమానిస్తాడు. తాను ధనికుడను అన్న అహంతో మాట్లాడిన మాటలను సీరియస్ గా తీసుకున్న కిషన్ అతనికి సరైన గుణపాఠం నేర్పాలని రైల్వే స్టేషన్ లో సామాన్లు మోసే వ్యక్తి రాజు (వరుణ్ ధావన్) ను అత్యంత ధనవంతుడిగా పరిచయం చేస్తాడు. కున్వర్ రాజ్ ప్రతాప్ సింగ్ అని అతని పేరు మార్చి బాగా డబ్బు ఉన్నట్లు చిత్రీకరిస్తాడు. వెంటనే రాజుకి అతని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు రోజారీయో. అయితే కాలం గడిచే కొద్దీ అతనికి రాజు ప్రవర్తనపై అనుమానం వస్తుంది. అతనికి ధనవంతుడికి ఉండే లక్షణాలు ఏవి లేవని గమనిస్తూ ఉంటే ఇక రాజు మాత్రం తన మామకు అనుమానం రాకుండా చేసే పనులు క్రియేట్ చేస్తాయి . ఇదే సమయంలో అతని లాగే ఇంకొకడు ఉన్నాడు అని కూడా తన మామ ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. చివరికి రోజారియో కి రాజు నిజస్వరూపం తెలిసిందా? తన ధనవంతుడి బుద్ధి మార్చుకుంటే లేదా అన్నది మిగిలిన కథ.
ప్లస్ లు
వరుణ్ ధావన్ పర్ఫార్మెన్స్
కామెడీ ఎపిసోడ్ లు
బాగా నవ్వు తెప్పించే పంచ్ లు
పెద్ద బోర్ లేకుండా సాగిపోయే స్క్రీన్ ప్లే
మైనస్ లు
కొన్ని చోట్ల మరీ ఓవర్ అనిపించే కామెడీ
దారుణమైన విఎఫ్ఎక్స్ షాట్లు
రైటింగ్ లో కొద్దిగా తడబాటు
మరికొంత మెరుగు పడాల్సిన ఎడిటింగ్
విశ్లేషణ
1995లో గోవింద హీరోగా వచ్చిన కూలి నెంబర్ వన్ భారీ హిట్. అప్పట్లో అది కామెడీ సినిమా లలో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అటువంటి ప్రొడక్ట్ ను రీమేక్ చేస్తున్నారు అంటే ఎన్నో విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. కథాంశం ఆసక్తికరమైనది కావడంతో కామెడీ సీన్లు బాగా పండాయి. వరుణ్ మాత్రం పర్ఫామెన్స్ ఇరగ్గోట్టేసాడు. మంచి కాస్టింగ్ వల్ల సినిమా అంతా క్వాలిటీ గా కనపడుతుంది. అయితే ఒరిజినల్ ను మించిపోయి లేదా దానితో సరిసమానంగా వచ్చే సినిమా అయితే ఇది కాదు. ఇందులో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. రైటింగ్ మరికొంత మెరుగు పడాల్సి ఉంది. ఎడిటింగ్ కూడా కొన్ని సీన్లలో అవసరం అనిపిస్తుంది. ఇక వీఎఫెక్స్ గురించి మాట్లాడకపోవడం మంచిది. అయితే మంచి టైంపాస్ సినిమా అని మాత్రం చెప్పవచ్చు. ఎంతైనా 1990ల్లో వచ్చిన కథకు 21వ శతాబ్దం మెరుగులు అద్ది తీసినందువల్ల కొద్దిగా ఒరిజినాలిటీ మిస్సయింది. కానీ మంచి కామెడీ ఎపిసోడ్ లు ఈ సినిమాని కాపాడాయి అని చెప్పాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!