తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గా భారతి హోళికేరి నియమితులైయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ గా రజీవ్ గాంధీ హనుమంతు, హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గా ఆమోయ్ కుమార్ (హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు) కుమురం భీం అసిఫాబాద్ కలెక్టర్ గా యాస్మిన్ బాషా, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా జి రవి, సూర్యపేట జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకటరావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఎస్ హరీశ్ ను నియమితులైయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ నెలలో కూడా సర్కార్ 14 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన