తెలంగాణలో గ్రుప్ – 1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జూన్ 5 నుండి జరగనున్నాయి. జూన్ 5 నుండి 12 వరకు ఏడు పరీక్షల తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25,050 మంది అభ్యర్ధులు మెయిన్స్ కు అర్హత సాధించారు. పరీక్షా విధానం, సిలబస్ ను టీఎస్ పీఎస్‌సీ ఇప్పటికే వెల్లడించింది. ఇంటర్వ్యూల విధానాన్ని తొలగించిన నేపథ్యంలో మెయిన్స్ లో ప్రతిభ ఆధారంగానే గ్రుప్ 1 నియామకాలు ఖరాలు కానున్నాయి.
జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, 6న పేపర్ – 1 జనరల్ ఎస్సే, 7న పేపర్ – 2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, 8న పేపర్ – 3 భారత సమాజం, రాజ్యంగం, పాలన, 9న ఎకానమీ,. డెవలప్ మెంట్, 10న సైన్స్ టెక్నాలజీ, డేటా సైన్స్, 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావిర్భావం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రధాన పరీక్షలు ఉంటాయి అయితే పరీక్షలు పూర్తిగా ఒకే భాషలో రాయాలని కమీషన్ స్పష్టం చేసింది. ఇక అభ్యర్ధులు అన్ని పరీక్షలు రాయాలనీ, ఒక్క పేపరు రాయకపోయినా ఉద్యోగ నియామకానికి అర్హత ఉండదని తెలిపింది.
రాష్ట్రంలో 503 పోస్టులకు గానూ 3,80,081 మంది ధరఖాస్తులు చేసుకోగా, అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమ్స్ కు 2,85,916 మంది అభ్యర్ధులు హజరైయ్యారు. మల్టీజోన్, రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 చొప్పున 25,050 మంది మెయిన్స్ కు ఎంపిక చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన
Supreme Court: నుపూర్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన జడ్జీలపై అభిశంస తీర్మానం పెట్టాలంటూ న్యాయవాదుల ఆందోళన