దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఇవేళ ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ నందు సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఏపిలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్దమని ప్రకటించారు.

ప్రపంచ వేదికపై ఏపిని నిలబెట్టేందుకు ఇన్వెస్టర్ల సహకారం అవసరమన్నారు సీఎం వైఎస్ జగన్ . ఈ విషయంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి గత మూడేళ్లుగా నెంబర్ వన్ గా ఉంటోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపిలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను సీఎం జగన్ ఇన్వెస్టర్లకు వివరించారు. పారిశ్రామిక వేత్తలు ఇచ్చి ఫీడ్ బ్యాక్ తోనే తాము నెంబర్ వన్ గా ఉన్నామని చెప్పారు. ఏపికి సుదీర్ఘ తీర ప్రాతం ఉందని తెలిపారు. 11.43 శాతం వృద్ది రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్ లలో మూడు ఏపికే రావడం శుభపరిణామని పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. బల్క్ డ్రగ్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్ సమృద్ధిగా ఉందని వివరించారు.

ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఇండియా సెయింట్ గోబైన్ సీఈఓ బి సంతానం, ఎవర్టన్ టీ ఇండియా డైరెక్టర్ రోషన్ గణవర్థన, టోరే ఇండస్ట్రీస్ ఎండీ యమగూచి, క్యాడ్ బరీ ఇండియా ప్రెసిడెంట్ దీపక్, కియా మోటర్స్ ఎండీ, సీఈఓ తాయి జిన్ తదితరులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
Breaking: అచ్చుతాపురం సెట్ లో భారీ పేలుడు .. ఒకరు మృతి
ఏపీకి కాబోయే రాజధాని విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను- పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ #APGIS2023 #InvestInAP pic.twitter.com/nClNQOuhbn
— YSR Congress Party (@YSRCParty) January 31, 2023