హైదరాబాద్ పాతబస్తీలో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఆస్తి తగదాల నేపథ్యంలో జరిగిన గొడవలో ఒక న్యాయవాది తన లైసెన్స్‌డ్ రివాల్వర్ తో కాల్పులు జరపడంతో స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు. వివరాల్లోకి వెళితే .. మీర్ చౌక్ లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన అరఫత్ అనే వ్యక్తి ఆ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆ ఇంటి పక్కన నివసించే వారు అతనితో గొడవకు దిగారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా, ఇల్లు ఎలా కొనుగోలు చేశారంటూ న్యాయవాది మసూద్ వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, కత్తులతో దాడులకు దిగారు. ఈ క్రమంలో న్యాయవాది మసూద్ ఇంట్లో ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసుకువచ్చి గాలిలోకి కాల్పులు జరిపాడు.

కాల్పుల మోతతో స్థానికులు ఆందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాదం పెద్దది కాకుండా న్యాయవాది సహా మరో వర్గం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రదేశంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై మీర్ చౌక్ ఏసీపీ దామోదరెడ్డి మాట్లాడుతూ .. గత శనివారమే అరఫత్ అనే వ్యక్తి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను కొనుగోలు చేసిన ఇంటిలోకి వెళ్లకుండా పక్కన వారు అడ్డుకుంటున్నారని, దానిపై ప్రశ్నిస్తే ఆ ఇంటి గురించి కోర్టులో కేసులు నడుస్తుండగా, ఇల్లు ఎలా కొనుగోలు చేశారంటూ అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Tadipatri: అనంతలో దారుణం .. నిద్రిస్తున్న దంపతులపై..