NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

నిర్మల్ జిల్లాలో సీఎం కేసిఆర్ వరాల జల్లు .. స్థానిక సంస్థలకు నిధులే నిధులే

Advertisements
Share

నిర్మల్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం కేసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసిఆర్ మాట్లాడుతూ .. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నామన్నారు. కలెక్టరేట్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా పది లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున,  జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండల కేంద్రానికి రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తానని తెలిపారు.

Advertisements
CM KCR

 

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశమంతటికి మోడల్ గా నిలిచిందన్నారు కేసిఆర్. తెలంగాణను మనందరి సమిష్టి కృషితో సాధించి నేడు అధ్బుత ఫలితాలను సాధిస్తున్నామనీ, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించబడి ప్రజలకు పరిపాలన మరింత చేరువైందన్నారు. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు, అందులోనూ అసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చింది అంటే అందుకు కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పాడటమేనని అన్నారు. ఏపితో కలిసి ఉంటే మరో 50 ఏళ్లకు కూడా ఈ మెడికల్ కాలేజీ వచ్చేది కాదని కేసిఆర్ పేర్కొన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.  ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి సరిపోదనీ, ముందు ముందు చేయాల్సిన అభివృద్ధి చాలానే ఉందని అన్నారు కేసిఆర్.

Advertisements

ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసిసింగ్ సెంటర్ లు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ ఏడాది నుండి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అమలు చేస్తామని కేసిఆర్ తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంది కాబట్టే భవిష్యత్తు కోసం పురోగమించాలన్నారు. బాగా కష్టపడి పేదరికారాన్ని తరిమేసి, దేశానికే తలమానికంగా నివాలని పిలుపునిచ్చారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్ల మొత్తం తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్ గా నిలిచిందన్న కేసిఆర్ జిల్లా ఉపాద్యాయులు, విద్యార్దులను అభినందిస్తున్నానన్నారు. బాసర సరస్వతి అమ్మవారి  ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని సీఎం కేసిఆర్ ప్రకటించారు.

మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?


Share
Advertisements

Related posts

BREAKING: భారత్ కు మరో సిల్వర్ మెడల్..!

amrutha

Bones: ఈ ఆహారాలు తింటే మీ ఎముకల ఆరోగ్యం అంతే సంగతులు..

bharani jella

తెలంగాణలో జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు బీహార్ కార్మికులు దుర్మరణం

somaraju sharma