NewsOrbit
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?

Advertisements
Share

ఈ నెల 2వ తేదీ ఒడిశా రాష్ట్రం బాలాసోర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి దాదాపు 280 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వెయ్యి మంది వరకూ క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘోర దుర్ఘటన ఊహించని ప్రమాదమే. సామాన్య ప్రజా నీకం మొదలు కొని ప్రధాన మంత్రి వరకూ ప్రతి ఒక్కరూ ఈ ఘోర దుర్ఘటనకు దిగ్భాంతిని, బాధను వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ మరుటి రోజే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారీగా ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది.

Advertisements
Train Accident

 

బాలాసోర్ రైలు దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు అజిత్ పవార్, దిగ్విజయ్ సింగ్ లు డిమాండ్ చేశారు. గతంలో రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించి లాల్ బహాదూర్ శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దేశంలో జరిగిన కొన్ని పెద్ద రైలు ప్రమాదాలకు బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి సహా అయిదుగురు రాజీనామా చేసినా ప్రస్తుత మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. ఇవన్నీ పక్కన బెడితే ..

Advertisements

డిసెంబర్ 30న తల్లి అంత్యక్రియల్లో … మే 28న పార్లమెంట్ ప్రారంభోత్సవ పూజల్లో ..

ఈ దుర్ఘటనకు మరో కోణం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా అంటే గత నెల 28వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజాస్వామ్యా దేవాలయంగా అభివర్ణిస్తున్న పార్లమెంట్ నూతన భవనాన్ని అట్టహాసంగా ప్రారంబించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశ ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో కాకుండా ప్రధాన మంత్రి మోడీ నిర్వహించడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అయితే ఈ కార్యక్రమం జరిగి వారం రోజులు తిరగకముందే దేశంలో ఓ పెద్ద ప్రమాదం జరగడంతో ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది నిజమేగా అని అనుకుంటున్నారు. ఇంతకూ ఆ పోస్టు వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబంలో జరిగిన ఓ దుర్ఘటన గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశారు. విషయం తెలియగానే ప్రధాని మోడీ ఢిల్లీ నుండి హుటాహుటిన అహ్మదాబాద్ (గుజరాత్) కు వెళ్లారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

 

మోడీ మాతృమూర్తి పరమపదించి ఆరు నెలలు కూడా కాలేదు. సాధారణంగా హిందువుల సంప్రదాయం ప్రకారం ఖర్మకాండల్లో పాలు పంచుకున్న వారికి ఏడాది పాటు సంవత్సర సూతకం ఉంటుంది. ఈ కాలంలో ఏ ముఖ్య కార్యక్రమాలను గృహ ప్రవేశాలు ఇత్యాధి కార్యక్రమాలు చేపట్టరు. అయితే రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులకు మినహాయింపు ఉంటుందేమో పండితులు తెలియజేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాకుండా వేరే బీజేపీ యేతర ప్రధాన మంత్రి ఎవరైనా ఈ విధంగా పార్లమెంట్ భవనాన్ని సంవత్సర సూతకం పూర్తి కాకుండా ప్రారంభోత్సవ పూజలు చేసిన తర్వాత భారీ దుర్ఘటన జరిగి ఉంటే .. బీజేపీ మరియు హిందూత్వ వాదులు హింధూ ధర్మాన్ని మంటగలిపినందునే దుర్ఘటన జరిగింది అంటూ నానా యాగీ చేసేవాళ్లు. రాజీనామాకు పట్టుబట్టే వాళ్లు. ఇప్పుడు మోడీ కావడం వల్లనే హిందూత్వవాదులు ఎవ్వరూ నోరు మెదపడం లేదు అని అంటున్నారు. నిజమా..? కాదా ..? మీరు కామెంట్ చేయండి.

Train Accident: రైలు ప్రమాద బాధితులకు ఏపీ సర్కార్ ఎక్స్ గ్రేషియా మంజూరు .. పరిహారం వివరాలు ఇలా


Share
Advertisements

Related posts

Siri: గంట క్రితం ఇన్ స్టాలో ఒకే ఒక్క వీడియో పెట్టిన సిరి హన్మంత్ – దెబ్బకి అందరి నోర్లూ మూయించింది!

Ram

ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా ప్రభాస్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు ..?

GRK

Radheshyam: 400 కోట్లు..! రాధేశ్యామ్ కి భారీ ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్..!?

Srinivas Manem