NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: కాంగ్రెస్ తో కటీఫ్ .. ఒంటరిగానే సీపీఎం పోటీ

Telangana Assembly Polls: కాంగ్రెస్ తో పొత్తునకు సీపీఎం కటీఫ్ చెప్పింది. ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయానికి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టులకు చేరో రెండు సీట్లు కేటాయింపునకు తొలుత కాంగ్రెస్ తో ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సీపీఎం అడిగిన స్థానాలు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పొత్తు పెటాకులైంది. కాంగ్రెస్ వైఖరి కారణంగా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు కేటాయిస్తామన్న సీట్ల విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని చెప్పారు.

అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తమ్మినేని. రాష్ట్ర వ్యాప్తంగా 20 సీట్లలో పోటీ లో ఉంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పోటీ చేసే 17 స్థానాలను తమ్మినేని ప్రకటించారు. భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు. వైరా, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్లు, భువనగిరి, హూజూర్ నగర్, కోదాడ, జనగామ, ముషీరాబాద్, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరులో లో పోటీ చేస్తామన్న చెప్పిన తమ్మినేని.. రెండు మూడు రోజుల్లో అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. వీటిలోనూ ఒకటి రెండు చోట్ల మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు.

తమకు తొలుత భద్రాచలం కేటాయిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పిందని అన్నారు తమ్మినేని. పాలేరు విషయంలో తామే వెనక్కు తగ్గామని అన్నారు. వైరా ఇస్తామని తాము చెప్పలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అబద్దమాడారని అన్నారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో వారికి మద్దతు ఇస్తామని తమ్మినేని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదు అన్నదే ఉభయ కమ్యూనిస్టుల ప్రయత్నమని తెలిపారు. బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్లో తాము తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. తమకు ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇస్తామని అనడం సరికాదని అయన అన్నారు.

Chandrababu: చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?