NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah – Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ.. పొత్తులపై స్పష్టత వస్తున్నట్లే..!

Amit Shah – Pawan Kalyan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు పై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీలో బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Pawan Kalyan Amit Shah

అయితే వీరి భేటీలో తెలంగాణ ఎన్నికలకు సంబందించి మాత్రమే చర్చ జరిగిందా.. ఏపీ విషయాలపైనా చర్చించారా అనేది తెలియరాలేదు. పొత్తులో భాగంగా తెలంగాణ లో 20 స్థానాల వరకూ జనసేన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పది నుండి 12 స్థానాలు కేటాయించేందుకు సుముఖంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో జనసేన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం సూచనల మేరకు అటు ఇటుగా సీట్ల కేటాయింపునకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతును కోరారు. ఈ సందర్భంలో తమ పార్టీ క్యాడర్ పలు స్థానాల్లో పోటీకి సిద్దంగా ఉన్నట్లు పవన్ వారికి తెలియజేశారు. జనసేనతో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా ఆలస్యం అయ్యింది.

ఈ నెల 27వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంలోనే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీ నుండి పిలుపు రావడంతో కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.

Komatireddy Rajagopal Reddy: బీజేపీకీ కటీఫ్ చెప్పిన కోమటిరెడ్డి .. మరల కాంగ్రెస్ గూటికి ..

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!