NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు ఇవి అన్న రాహుల్ గాంధీ

Share

Rahul Gandhi: రాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. 2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందనీ, ఆ హామీని కాంగ్రెస్ ఎలా సాకారం చేసిందో అందరికీ తెలుసునన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమకు నష్టం కల్గించే నిర్ణయాలు తీసుకోవని కానీ కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగా ఇచ్చిందని అన్నారు.

కేసిఆర్ గతంలో ఏన్నో  హామీలు ఇచ్చారు అవి నెరవేర్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తాము నెరవేర్చామన్నారు. రాజస్థాన్ లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామని చెప్పామనీ, అమలు చేసి చూపామన్నారు. రూ.25 లక్షల వరకూ ఉచితంగానే వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాజస్థాన్ ఉచిత వైద్య పథకం దేశంలోనే అద్భుతంగా ఉందన్నారు. చత్తీస్ గఢ్ లో ధాన్యం క్వింటాల్ రూ.2500లకు కొనుగోలు చేస్తున్నామన్నారు. దేశంలోనే వరి ధాన్యం కొనుగోలు ధర చత్తీస్ గఢ్ లోనే ఎక్కువ అని తెలిపారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్ లోకి ఉచితంగా డబ్బు పడుతున్నాయనీ, ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పకుండా నిలబెట్టుకుంటుందని రాహుల్ గాంధీ అన్నారు.  

సమక్క సారక్క జాతరను జాతీయ పండుగా ప్రకటిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో అధికారంలోకి రాగానే ఈ జాతర ను జాతీయ పండుగగా గుర్తిస్తామని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నిక జరుగుతుందన్నారు. బీజేపీ ఇప్పటికే ఓటమి పాలైందని అన్నారు. బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటుందని రాహుల్ అన్నారు. రెండు పార్టీలు కలిసి ఉన్నాయన్నారు. వారితో ఎంఐఎం కలిసి పని చేస్తుందన్నారు. పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు మీ ముందుకు వస్తున్నాయని తెలిపారు.

విపక్ష నేతలపై మాత్రం అన్ని కేసులు పెడతారని, చివరకు తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, కానీ కేసిఆర్ పై ఒక్క కేసు కూడా ఉండదన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. తమను నమ్మి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు.

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక ను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించిందని అన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హజరైయ్యారు. ముందుగా రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను రాహుల్, ప్రియాంక ప్రారంభించారు.

Janasena: తెలంగాణలో ఉమ్మడి పోటీపై పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు చర్చలు ..సందిగ్దంలో జనసేన


Share

Related posts

వచ్చే డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చూస్తాం.. !!

somaraju sharma

Visakha Steel Plant: జగన్ నాయకత్వానికి చంద్రబాబు జిందాబాద్ కొడతారంట..! ఏపిలో ఊహించని ట్విస్ట్..!!

Srinivas Manem

ఇదేం ఉదాహరణ!

Siva Prasad