NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TS Politics: తెలంగాణలో లెటెస్ట్ సర్వే ..! టీఆర్ఎస్‌కి కష్టమే ..కానీ..!?

TS Politics: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మద్యం ధరలు, నాటు సారా కేసులు, జే బ్రాండ్, పెగాసెస్, మూడు రాజధానులు, పోలవరం లాంటి ఇష్యూలతో తిరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో రాజకీయాలు ఆ పార్టీల అంతర్గత గొడవలు ఒక వైపు, పార్టీలకు పార్టీలకు మధ్య గొడవలు ఒక వైపుతో మొత్తానికి రాజకీయ కాక ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగానే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి అనేది సుస్పష్టం. ఇప్పటికే సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. మూడు నాలుగు నెలల నుండి పది నుండి 15 సర్వే సంస్థలు వీటిలో జాతీయ స్థాయి సంస్థలు కూడా సర్వేలు మొదలు పెట్టాయి.

TS Politics latest survey report
TS Politics latest survey report

 

TS Politics: ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాదు..?

తాజాగా ఓ సర్వే సంస్థ నివేదిక బయటకు వచ్చాయి. కొందరు సీనియర్ జర్నలిస్టులు జాతీయ స్థాయి సంస్థతో కలిసి ఇటీవల సర్వే చేశారు. వీళ్లు ఫిబ్రవరి 5వ తేదీ నుండి మార్చి 10వ తేదీ మధ్య సర్వే చేశారు. మొత్తం 119 నియోజకవర్గాలకు ఓ పెద్ద టీమ్ సర్వేకు వెళ్లింది. ఒక్కో నియోజకవర్గంలో సరాసరి 1500 నుండి 2 వేల శాంపిల్స్ తీసుకున్నారు. వాస్తవానికి వీళ్లు తీసుకున్న శాంపిల్స్ చాలా తక్కువ కిందే లెక్క. అర్బన్ లో 2వేలు, రూరల్ లో 1500 శాంపిల్స్ తీసుకున్నారు. 119 నియోజకవర్గాల మీద బ్రీఫ్ గా రిపోర్టు తయారు చేసుకున్నారు. వాళ్లకు వచ్చిన రిజల్ట్ మేరకు ఏ రాజకీయ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) రాదు అని తేలిందట. అయితే రీసెంట్ గా కేసిఆర్ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ కు కఛ్చితంగా 105 సీట్లు వస్తాయి. సర్వే చేయించాము అని చెప్పారు. ఇది అంత వాస్తవం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్యాడర్ ను ఉత్సాహపరిచేందుకు కేసిఆర్ అలా చెప్పి ఉంటారని భావిస్తున్నారు. వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన తరువాత మూడవ సారి అధికారంలోకి రావడం అనేది చాలా కష్టం. అందులోనూ తెలంగాణలో గతంతో పోలిస్తే బీజేపీ పునాదులు బలపడ్డాయి.

 

Read More: KCR: కేసిఆర్ కేజ్రీవాల్ కలిసి..!? తెలంగాణలో కొత్త ప్రణాళికలు..!

TS Politics:  ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు..?

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆ సర్వే ప్రకారం చూసుకుంటే.. టీఆర్ఎస్ పార్టీకి 42 – 47 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపికి 18 – 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 21 – 26 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎంఐఎం పార్టీకి 6-8 స్థానాలు వస్తాయని చెప్పింది. ఆ పార్టీ గతం నుండి ఆరు ఎడు గెలుస్తూ వస్తోంది. అయితే ఈ సారి ఇతరులకు ఎక్కువ స్థానాలు రాబోతున్నాయట. దాదాపు 8-12 ఇతరులు గెలుస్తారు అని ఈ సర్వే చెబుతోంది. ఇతరులు అంటే వామపక్షాలు, బీఎస్పీ, టీడీపీ, వైఎస్ఆర్టీపీ, లోక్ సత్తా లాంటి పార్టీలుగా పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం చూసుకున్నా ఇతర రెండు పార్టీల కంటే టీఆర్ఎస్ పార్టీయే సంస్థాగతంగా, కార్యకర్తల పరంగా బలంగా ఉంది. ఆర్ధికంగానూ బలంగా ఉంది. ఇంకా ఎన్నికలకు మరో సంవత్సరం సమయం ఉన్నందున టీఆర్ఎస్ పుంజుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉంది. ఆర్ధికంగానూ బలంగా ఉంది. ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలు పెడితే ఆ స్థానాలను పెంచుకోవచ్చని పేర్కొంది.

 

 టీఆర్ఎస్ కు ధీటుగా ఖర్చు పెడితే..

ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇతర కొన్ని పార్టీలతో కలిసి పోటీ చేయడంతో పాటు ఆర్ధికంగానూ టీఆర్ఎస్ కు ధీటుగా ఖర్చు పెడితే కొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీ కూడా అగ్రనాయకత్వాన్ని రంగంలోకి దింపి బీహార్ తరహా పాలిటిక్స్ వ్యూహాలను అమలు చేస్తే ఆ పార్టీకి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 60. అయితే ఏ రాజకీయ పార్టీకి 60 స్థానాలు అయితే రావు అనే ఈ సర్వే సంస్థ తేల్చి చెబుతోంది. రాజకీయంగా ఏ పార్టీకి స్థిరమైన మెజార్టీ లేదు అని తెలంగాణ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

author avatar
Srinivas Manem

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju