Brahmamudi Serial మే 26th ఎపిసోడ్: నిన్నటి ఎపిసోడ్ లో మీడియా రిపోర్టర్ శృతి తో రాహుల్ బయట మాట్లాడుతూ ఉంటాడు. నేను నిన్ను మోసం చేస్తున్నానని నీకంటే అందమైన అమ్మాయిని ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని రాహుల్ చెప్పేస్తాడు. చూస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు రాహుల్. ఇదంతా చూసినా కావ్య- కళ్యాన్ ఇద్దరు శృతికి అండగా నిలవాలని అనుకుంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో నీకు ఈ సంబంధం ఇష్టం లేదు
కనకం ఫ్యామిలీ పిలవడం తనకి ఇష్టం లేదని అపర్ణ చెప్తుంది. నీ కొడుకు ఆ ఇంటికి వెళ్ళాడు చాపపై మీద భోజనం చేశాడు. వాళ్ల మర్యాదలకు మరచిపోయి నువ్వు రమ్మన్నా రానన్నాడు. ఇంకా ఎందుకు వదిన బెట్టు చేస్తావు అంటుంది రుద్రాణి. అపర్ణ నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నా కొడుకు ఫంక్షన్ ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు నాకు తెలుసు నేను డిసైడ్ చేస్తే సరిపోతుంది. అందుకే ప్రతి దానికి అడ్డు తగులుతున్నావు అని రుద్రాణి అపర్ణతో అంటుంది. ఇది మన ఇంటి సంబంధం అక్కకి ఇష్టం లేనప్పుడు ఎందుకు వారిని పిలవడం అని దానిలక్ష్మి అంటుంది. వెంటనే ఇందిరా దేవి, ధాన్యలక్ష్మి ఆగు,నువ్వు చెప్పమ్మా రుద్రాణి అంటుంది. నేను చెప్పింది మీకు ఇష్టమే కదా అంటుంది రుద్రని. అయితే మీరు ఒప్పుకున్నట్లే కదా ఇప్పుడే పిలుస్తాను ఉండండి అని రుద్రానికి ఫోన్ చేస్తుంది.

మీరు మా ఇంటికి రావాలి
ఇంటిని రుద్రాణి కనకానికి ఫోన్ చేస్తాను రేపు మా అబ్బాయి నిశ్చితార్థం మీరంతా తప్పకుండా రండి అని పిలుస్తుంది. స్వప్న కూడా రేపే నండి నిశ్చితార్థం అనుకుంటున్నాను అని కనుక ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో మీరు పిలవడమే మా అదృష్టం మేము రాలేని పరిస్థితుల్లో ఉన్నా ఏమీ అనుకోకండి అని అంటుంది కనుకమ్. మీరు రాలేని పని ఉంటుందా.. అని అంటుంది రుద్రాని. అయ్యో అలా కాదండి రేపు ఒక పూచి పెట్టుకున్నాను అందుకే రాలేకపోతున్నాం తప్పు అనుకోకండి అని అంటుంది కనుకమ్. సరే పెళ్ళికి మాత్రం తప్పకుండా రండి అని అంటుంది రుద్రాణి. సరే అంటుంది కనకం. ధనలక్ష్మి మనసులో వీళ్ళు రాకపోవడం మంచిది అనుకుంటుంది

నిజం చెప్పాలి ఈరోజు
కావ్య కళ్యాణ్ ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు. తెనాలి రాహుల్ ఒక రోమియో అనుకున్నాను సరదాగా అమ్మాయిలతో తిరుగుతాడు అనుకున్నాను కానీ ఇంత బాడ్ అని ఇంత చీప్ క్యారెక్టర్ అని అనుకోలేదు అని అంటుంది కావ్య. నేను కూడా ఊహించలేదు వదినా, అమ్మాయిలతో టైం పాస్ చేస్తాడు అనుకున్నాను కానీ, ఇలా మోసం చేస్తాడు అని అనుకోలేదు. అక్కనిఅక్క ప్రేమించింది కదా అని ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే తన వంకర బుద్ధి మారుతుందని ఏంటి గ్యారెంటీ. మా అక్కకి వీడి లాంటివాడని తెలిసి కూడా ఇచ్చి పెళ్లి చేయాలా అని అంటుంది కావ్య. అసలు రంగు మీ అన్నయ్యకు మా అక్కయ్యకు తెలిస్తే సరిపోదు కుంభస్థలం బద్దలు కొడదాం. అంటుంది కావ్య. అర్థం కానట్లు తల ఊపుతాడు కళ్యాణ్. అన్ని ముందుగానే చెప్పేస్తే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ నాకన్నా నీకే బాగా తెలుస్తాయి అంటుంది కావ్య.

సాక్షాలు కూడా వస్తాయి.
వదిన మన దగ్గర ఎలాంటి సాక్షాలు లేవు కదా, సృతే కాదు, రమ్య, సౌమ్య, ఊర్మిళ… అంటాడు కళ్యాణ్. వీళ్లంతా ఎవరు అంటుంది కావ్య. వీళ్ళు అందరూ వచ్చి రాహుల్ మమల్ని ప్రేమ పేరుతో మోసం చేశారని చెప్పినా… సింపుల్ గా ప్రూఫ్ ఏంటి అని అంటారు. తెలుసు కవి గారు శృతి కలలో బాధ చూశాను. గుండె లోతుల్లో నుంచి పుట్టిన ద్వేషం అంత త్వరగా చల్లారాదు. శృతి సాక్షాలను బయటపడుతుంది. అంటుంది కావ్య.. పుట్టలో పాముని పొగ పెట్టి మరీ బయటకు రప్పిద్దాం అంటాడు కళ్యాణ్.
మాఇంటి పరువు తీసింది మీరే కదా
రుద్రాణి కాశీ నగలను తీసుకొచ్చి ఇందిరాదేవికి చూపిస్తుంది. ఎంగేజ్మెంట్లో మా కోడలికి ఇది పెడతాను అంటుంది. వీటితోపాటు విహారం ఎందుకు వచ్చింది అని అంటుంది అపర్ణ. ఏమైంది అంటుంది రుద్రాని. ఇది ఇంకా మార్కెట్లోకి ఇప్పుడు ఇది రిలీజ్ చేయకూడదు అంటుంది అపర్ణ. నా కొడుకు పెళ్లి, సపరేట్ గా ఉండాలి కదా, నీ కొడుకు పెళ్లి లాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయితో జరిగే, పెళ్లి కాదు కదా అంటుంది రుద్రణి. నీ కొడుకు పెళ్లి తో పోయిన పరువుని నా కొడుకు పెళ్లి తో నిలబడతాను అంటుంది రుద్రణి. మీరు ఎవరు ఏమంటున్నారో తెలుసుకోవచ్చా అంటుంది కావ్య. ఏం వినలేదా, సరిగ్గా అర్థం కాలేదా, ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు అప్పుడే మర్చిపోయారా, మా అక్క వెళ్ళిపోతే మమ్మల్ని తొందర పెట్టి మీరు నా నెత్తిన ముసుగు వేసి పీటల మీద కూర్చోబెట్టింది అని అంటుంది కావ్య. అంటే మా ఆయన పరువు మా అత్త గారి పరువు తీసింది ఎవరు మీరే అని కావ్య రుద్రాణి వైపు చూసి అంటుంది.

నీకు ఎంత ధైర్యం నన్నే అంటావా
మీరే కదా నన్ను బలవంతంగా అంట కట్టింది ఇప్పుడు మా వాళ్ళని హేళన చేస్తున్నారు ఏంటి. మీరు పేద ఇంటి అమ్మాయిని చేసుకుంటున్నారంటే ఆదర్శంగా అనుకుంటారు కానీ ఎవరు అవమానించడం లేదు నీలాగా, నీకు ఎవరు మార్కెట్లోకి రిలీజ్ చేయని నగలు కావాలి మరి వాటిని తయారు చేయించింది ఎవరు మా ఆయన అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది కావ్య.. హౌ డేర్ యు నిన్నకాక మొన్న మా ఇంటికి వచ్చి నన్ను అన్ని మాటలు అంటావా, ఏంటి ఎవరు మాట్లాడరేంటి అంటుంది రుద్రాణి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు ఇంట్లో అందరికీ మాట్లాడే స్వాతంత్రం ఉంటుంది అని అంటుంది ఇందిరా దేవి. స్వాతంత్రం ఉంది కదా అని నన్ను మాట్లాడడానికి ఈ అమ్మాయి ఎవరు. నేను ఏంటి ఆడపడుచు అని రుద్రాణి అంటుంది. ఆడపడుచు అంటే పుట్టింటి గౌరవం నిలబెట్టాలి అంతేకానీ పుట్టింటినే అవమానించకూడదు హేళన చేయకూడదు అండి ఇది మీకు న్యాయం కాదు అని అంటుంది కావ్యా.

ఎవరి మీద చెయ్యెత్తుతున్న దించు..
నువ్వు నాకు నీతులు చెబుతావా నువ్వు ఎంత నీ బతుకెంత అని కావ్య ని కొట్టడానికి కోపంతో రుద్రాణి పైకి లేపుతుంది చేయి. వెంటనే రుద్రాణి అని అపర్ణ గట్టిగా అరుస్తుంది. దీంతో రుద్రాణి సహా అందరూ షాక్ అవుతారు. ఎవరి మీద చేయి ఎత్తుకున్నా దించు ఇది దుగ్గిరాల వారి కుటుంబం.ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయి. మీ ఇంటి కోడలు మీరే చెయ్యి ఎత్తుతావా అని అంటుంది అపర్ణ.మీరంతా అప్పుడే ఒక్కటైపోయారా, నా కొడుక్కి వెయ్యికోట్ల ఆస్తిపరులు సంబంధం వస్తే, అసూయతో రగిలిపోతున్నారన్నమాట, అది ఇప్పుడు బయటపడింది అని రుద్రాణి డైలాగ్ కొడుతుంది. మీరు అనుకున్నట్లు అసూయతో రగిలి పోయే మనిషి అయితే మా అత్తగారు మీ పెళ్లి చెడగొట్టడానికి ఒక క్షణం పట్టదు. అరుంధతి గారు మా అత్తగారు ప్రాణ స్నేహితుల అన్న సంగతి మీరు మర్చిపోయారు. అసలు మా అత్తగారు తలుచుకుంటే మీ ముగ్గురు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండగల రా.. కానీ, మా అత్త గారిని కానీ, ఇంకొక్క మాట అంటె నేను ఊరుకోను, గుర్తుపెట్టుకోండి.. అనిరుద్రానికి వార్నింగ్ ఇచ్చి కావ్య తన గదికి వెళ్ళబోతుంది.
ఆగు అని కావ్యను అపర్ణ పిలుస్తుంది. చీర, నగలు తీసి.. రాజ్ ని పిలుస్తుంది. మన ఇంటి కోడలికి మన స్థాయి తగ్గట్టుగా ఉండాలి కదా అని అంటుంది అపర్ణ. ఇవి తీసుకెళ్లి ఇవ్వు అని రాజ్ తో చెబుతుంది. రాజ్ ఆశ్చర్యపడుతాడు. రేపు జరగబోయే.. నిశ్చితార్థానికి అందరు బంధువులు వస్తారని, ఈ ఇంటి కోడలు మనస్థాయికి తగ్గట్టుగా ఉండాలని ఇవ్వమని రాజ్ ని ఆదేశిస్తుంది అపర్ణ. రాజ్ వెళ్లి కావ్యకు చీర, నగలు ఇస్తాడు.
కావ్య సంతోషం

కావ్య లోలోపల సంతోష పడుతుంది.ఎందుకు అంతా ఆశ్చర్యపోతున్నావ్ మనవరాలా.. నువ్ ఈ ఇంటి కోడలివి అని మీ అత్తయ్య చెప్పకనే చెప్పిందని ఇంటి పెద్ద అంటుంది. గదిలోకి వెళ్లి చీర, నగలను ప్రేమతో చూసుకుంటుంది కావ్య. ఇదే సమయంలో అపర్ణ గదిలోకి వస్తుంది. చాలా మురిసిపోతున్నావ్ అనుకుంటాను, చీర నగలు ఇచ్చింది నువ్ మాకు సపోర్ట్ చేసినందుకో.. రుద్రాణిని విమర్శించినందుకో కాదు అని అపర్ణ అంటుంది. నువ్ ఈ ఇంటికి అతిథివి మాత్రమేనని కావ్యతో చెబుతుంది. మా ఫ్రెండ్ అరుంధతీ నిన్ను మా ఇంటి పనిమనిషి అనుకుందని చెబుతుంది. రేపు ఆ స్థాయిలో వాళ్లు అంతా వస్తారు, నిన్ను మా కోడలు అని చెప్పకపోయినా.. అరుంధతీ అందరికీ పరిచయం చేస్తుందని అపర్ణ అంటుంది. మా ఖర్మ కొద్దీ పది మది దృష్టిలో నువ్ దుగ్గిరాలవారి కోడలివి అయిపోయావ్ కదా అని అంటుంది అపర్ణ. అందుకే ఇస్తున్నా.. పొంగిపోకు అని చెబుతుంది.ఈ విషయం అనడంతో కావ్య లోలోపల బాధపడిపోతూ ఉంటుంది. ఇదే సమయంలో వచ్చిన రాజ్.. ఇంచు మించు నా అభిప్రాయం, మా అమ్మ అభిప్రాయం ఒకటేనని రాజ్ అంటాడు. నీ వైపు తప్పులేదని తెలిస్తేనే ఈ ఇంట్లో చోటు అని రాజ్ ఖరాఖండి చెప్పేస్తాడు. మీ వైపు అపనమ్మకం ఉందని, నేను ఈ ఇంటికి అతిథిని కాదని ఏదో ఒకరోజు మీరే నమ్ముతారని కావ్య అంటుంది.మరోవైపు కనకం ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతాయి. రేపు మంచి ముహూర్తం ఉందని అయ్యగారు చెబుతారు. ఎన్ని సంబందాలు చెడగొట్టినా వీళ్లు నా పెళ్లి చేయకుండా ఉండలేరని స్వప్న మనసులో అనుకుంటుంది. ప్రేమించినవాడు త్యాగం అంటున్నాడు, కన్నవాళ్లు వేరేవాడితో పెళ్లికి బలవంతం చేస్తున్నారని బాధపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలని, దేవుడా ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని అనుకుంటుంది.

కనకం ముహూర్తం మారుస్తుందా
రేపు కాకుండా వేరే రోజున ముహూర్తం ఏదైనా ఉందా అని అడుగుతాడు కనకం భర్త. అదేంటండి రేపు దివ్యమైన ముహూర్తమని పంతులుగారు చెబుతున్నారు కదా అని కనకం అంటుంది. రేపటికి రేపు అంటే మరీ తొందరపడుతున్నామని భర్త అంటాడు. ఇంకా ఆలస్యం చేస్తే.. ఏమవుతుందోనని తన భయాన్ని చెబుతుంది కనకం. మరోవైపు వెన్నెల, రాహుల్ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేందుకు అయ్యగారు వస్తారు. నిశ్చితార్థానికి వెన్నెల జాతకంలో ఆటంకాలు లేవని, కానీ రాహుల్ జాతకంలో ఉన్నాయని అయ్యాగారు చెబుతారు. నో రేపే నిశ్చితార్థం జరిగి తీరాల్సిందేనని అపర్ణ అంటుంది. మీరు నన్ను కామెంట్ చేసినట్టుగా.. నేను గ్రహస్థితిని కామెంట్ చేయలేను కదా అని పూజారి అంటాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది….