Entertainment News Telugu TV Serials

Devatha 24 August: రాధకు ప్రత్యేకంగా చీర పంపించిన దేవుడమ్మ.. రుక్మిణి ముందు బాధపడిన ఆదిత్య .!?

Share

కమల బిడ్డ బాటసాల ఫంక్షన్ బాగా జరుగుతుంది.. ఇక ఆ ఫంక్షన్ నుంచి జానకమ్మ వెళ్ళొస్తాము అని చెప్పి వచ్చేస్తుండగా.. దేవుడమ్మ ఒక కవర్ తీసుకువచ్చి.. రాదను నేను ఎన్నోసార్లు చూద్దాం కలుద్దాం అంటే తను నా ముందుకు రావడం లేదు.. కానీ దేవీ రూపంలో మా ఇంటికి మంచి సంతోషాన్ని ఇచ్చింది.. దేవి నిజంగా మా అందరిలో కలిసిపోయి ఈ ఇంటి బిడ్డ లాగా ఉంది.. అందుకు కారణం రాధనే.. నా తరుపున రాధకి ఈ చీర కానుకగా ఇవ్వండి అని దేవుడమ్మ జానకమ్మకు ఇస్తుంది .. తప్పకుండా మా రాధను మీకు చూపించే బాధ్యత నాది అని జానకమ్మ అనగానే.. మాట ఇస్తున్నారు అని దేవుడమ్మ అంటుంది.. మాట తప్పను లే అని జానకమ్మ అంటుంది..

జానకమ్మ ఆ చీరను ఇంటికి తీసుకువెళ్లి రామ్మూర్తి ముందు ఆ చీరను ఎగాదిగా చూస్తుంది. నీ ఆడ బుద్ధి పోనించుకున్నావు కాదంటే అని అంటాడు. ఈ చీర బాగుందో లేదో చెప్పండి అని జానకమ్మ అడుగుతుంది. అవి నాకేం తెలుస్తాయి నువ్వే చెప్పు అని అంటాడు. ఈ చీర చాలా బాగుంది. రాధ మీద దేవుడమ్మకు ఎంత ప్రేమ ఉందో ఈ చీరను బట్టి చెప్పేయొచ్చు అని జానకమ్మ అంటున్న మాటలు మాధవ్ వెనకనుంచి వింటాడు.. దేవుడమ్మ వాళ్ళ కుటుంబం చాలా మంచి వాళ్ళు అని జానకమ్మ రామ్మూర్తి అనుకుంటారు.

రుక్మిణి ఆదిత్యను కలిసి పెనిమిటి ఈరోజు నాకు ఎంత సంబరంగా ఉందో తెలుసా.. నేను రాలేను అనుకున్నా నా ఇంటికి నేను వచ్చాను.. నావాళ్లు అందరూ ముందుకు వచ్చాను అని రుక్మిణి ఆనందంగా చెబుతుంది. దేవికి ఇంట్లో అందరూ చాలా మంచిగా మర్యాదలు చేస్తున్నారు. దేవిని అంత చక్కగా చూసుకుంటుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అని రుక్మిణి అంటుంది. కానీ దేవి చేత నాన్న అని పిలిపించుకోలేకపోతున్నాను అని బాధ మాత్రం నాకు చాలా ఉంది అని ఆదిత్య అంటాడు..


Share

Related posts

NTR Prabhas: బాలీవుడ్ బాడానిర్మాత బిగ్గెస్ట్ ప్లానింగ్.. మాస్ మల్టీస్టారర్ మూవీ ఎన్టీఆర్, ప్రభాస్..లతో ??

sekhar

అఖిల్‌కు అది పెద్ద త‌ల‌నొప్పిగా మారిన‌ట్లుందే?!

kavya N

చిరంజీవి సినిమాకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్న డైరెక్టర్ బాబి..??

sekhar