16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 24 August: తులసిలో అష్ట దేవతలను వర్ణించిన సామ్రాట్..!

Share

తులసి, సామ్రాట్ ల గురించి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ గురించి అభి నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు.. పరంధామయ్య సీరియస్ అవుతూ తులసికి స్వేచ్ఛను ఇవ్వండి.. ఇప్పటి వరకు మనం చేసిన తప్పు చాలు ఈ విషయం తులసికి తెలియకుండా జాగ్రత్త పడండి.. ఇట్స్ మై ఆర్డర్ అని పరంధామయ్య అంటారు.. అప్పుడే తులసి ఇంట్లోకి వస్తుంది. ఏమైంది అందరూ ఆదోలా ఉన్నారు అని అడుగుతుంది. అంతలో సామ్రాట్ తులసి గారు అంటూ ఇంట్లోకి వస్తాడు. మీతో ఓ విషయం గురించి పర్సనల్ గా మాట్లాడాలి అని అంటాడు. మీరు ఏం మాట్లాడాలని అనుకున్నా మా అందరి ముందు మాట్లాడండి. మా మధ్య ఎలాంటి దాపరికాలో ఉండవు అని అభి అంటాడు.. తులసికి ఫోన్లో వచ్చిన ఆర్టికల్ గురించి చూపిస్తాడు సామ్రాట్.. అది అంతా చదివిన తర్వాత దీని గురించి మీరు పట్టించుకుంటున్నారా.. నేనైతే పట్టించుకోవడం లేదు అని తులసి చెప్పి షాక్ ఇస్తుంది.. మా ఇంట్లో వాళ్లు కూడా నామీద నమ్మకం ఉంచారు.. ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికీ తులసి అంటుంది..

సామ్రాట్ తులసి నీ తలచుకుని ఒంటరిగా ఆనందిస్తూ.. తనతో గడిపిన వైజాగ్ టూర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. తులసి బీచ్ లో చేసిన అల్లరి.. పొద్దున ఆర్టికల్ గురించి మాట్లాడిన తీరు గురించి గుర్తు చేసుకుని సామ్రాట్ తనలో తానే నవ్వుతుండగా.. అప్పుడే వాళ్ళ బాబాయి వచ్చి సామ్రాట్ ను చూస్తూ నీ మనసుకు ఇన్నాళ్లు వేసుకున్న సంకెళ్లు అన్నింటినీ తెంపేసినట్టు ఉన్నావు అని అంటాడు.. అవును బాబాయ్ నువ్వు ఊహించింది కరెక్టే అని అంటాడు.. అసలు నీలో ఈ మార్పు కి కారణం ఏంటి అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. తులసి గారు.. స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు అలా ఎందుకు అంటారో నాకు తెలియదు.. కానీ తులసి గారుని చూస్తేనే నాకు అర్థమైంది.. తులసికి చదువు లేకపోవచ్చు కానీ జీవితంలో తను ఎన్నో పాఠాలను నేర్చుకుంది.. హాని చేసే వారికి కూడా మంచి చేసే గొప్ప గుణం తులసికి ఉంది అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. హనీ ని లిఫ్టులో కాపాడినప్పుడు తులసిలో నాకు తల్లి ప్రేమ కనిపించింది.. నేను ఇచ్చిన బ్లాక్ చెక్ నా మొహానికి కొట్టడానికి వచ్చినప్పుడు ఆమెలో కాళికామాత కనిపించింది.. మ్యూజిక్ స్కూల్ కోసం ఆమె పడే తపన చూస్తుంటే తనలో నాకు సరస్వతి దేవి కనిపించింది.. మొదటిసారి ఆమె ఫ్లైట్ ఎక్కినప్పుడు సముద్రంలో ఆడుకుంటున్నప్పుడు తులసి గారిలో ఒక అమాయకురాలిని చూశాను.. ఒక పసిపాప కనిపించింది బాబాయ్..

 

ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ప్యాసింజర్స్ అందరూ భయపడిపోతుంటే.. అందర్నీ కంట్రోల్ చేస్తూ కూల్ గా ఉంచిన తులసి గారిలో ఓ గాయత్రీ దేవి కనిపించింది.. తులసి జీవితంలో అన్నీ కోల్పోయిన కూడా తను ఇవన్నీ చేస్తుంది అంటే తనలో ఓ ఫైటర్ కనిపిస్తుంది.. కొద్దిరోజుల పరిషయంలోనే నేను తులసిలో ఇన్ని కోణాలు చూశాను బాబాయ్.. ఇప్పుడు తెలిసింది నేను జీవితాన్ని ఎంతలా వృధా చేసుకుంటున్నాను అని సామ్రాట్ అంటాడు.. హోదా డబ్బు ఉంటే చాలు.. అంతకుమించి ఇంకా ఏం అవసరం లేదు అని అనుకున్నాను.. ఇన్నాళ్లు బ్రమలో ఉన్నాను ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నయ్ బాబాయ్ అని సామ్రాట్ అంటాడు.. చిన్ని చిన్ని ఆశలు నెరవేరితే ఆ సంతోషం ఎలా ఉంటుందో తులసిగారిలో చూసి నేర్చుకున్నాను బాబాయ్.. నేను మారాలనుకుంటున్నాను బాబాయ్ అని సామ్రాట్ అనగానే చాలా సంతోషంరా.. నీలో ఇలాంటి మార్పు కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూసాను.. ఎవరి వల్ల కాని పని తులసి వల్ల అయింది అని వాళ్ళ బాబాయ్ అంటాడు.. తులసి జీవితంలో ఎన్నో కోల్పోయిన కానీ తన ఆత్మాభిమానాన్ని మాత్రం కోల్పోలేదు.. అది కదా బాబాయి గొప్పతనం అంటే.. డబ్బుల కోసం గడ్డు పరిస్థితుల్లో ఉన్నా కూడా తను ఎవరి దగ్గర చేయి చాచలేదు అది కదా బాబాయ్ గొప్పతనం అంటే.. జీవితంలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది తులసి గారికి సపోర్టుగా నిలబడటమే.. ఒక మధ్య తరగతి స్త్రీకి ఎదుగుదలకి అడ్డుగా నిలబడడమే..

దానివల్ల తులసి గారికి ఏం మేలు జరిగిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా మంచి జరిగింది అని తన గుండెల మీద చేయి వేసుకొని చెబుతాడు సామ్రాట్.. నా జీవితమే మారిపోయింది.. థాంక్స్ తులసి.. థాంక్యూ సో మచ్ అని తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు సామ్రాట్.. రేయ్ అబ్బాయి నేను అర్జెంటుగా వెళ్లి దేవుడికి దండం పెట్టుకోవాలి అని సామ్రాట్ వాళ్ళ బాబాయి అంటాడు..


Share

Related posts

మల్టీప్లెక్స్ లలో పాప్ కార్న్ ధర అంత ఎక్కువగా అమ్మటానికి కారణం చెప్పిన..PVR సంస్థ అధినేత..!!

sekhar

సెన్సార్ పూర్తి చేసుకున్న `లైగ‌ర్‌`.. ర‌న్ టైమ్ ఎంతో తెలుసా?

kavya N

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ల లిస్ట్..??

sekhar